Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడు : రియా చక్రవర్తి

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (15:32 IST)
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హత్య కేసు విచాణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అందరి దృష్టీ సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపైనే కేంద్రీకృతమైవుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. అయితే, సుశాంత్ చనిపోయిన చాలా రోజుల తర్వాత రియా చక్రవర్తి ఓ సంచలన విషయాన్ని వెల్లడించింది. సుశాంత్ మాదక ద్రవ్యాలను వినియోగించేవాడని చెప్పుకొచ్చింది. కానీ తనకు మాత్రం డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని స్పష్టం చేసింది. 
 
అంతేకాకుండా, సుశాంత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకుండా ఉండేందుకు వీలుగా హార్డ్ డిస్క్‌తో పాటు.. ఇతర సాక్ష్యాధారాలను ధ్వంసం చేసినట్టు వచ్చిన వార్తలను కూడా ఆమె ఖండించారు. పైగా, సుశాంత్ గదిలో ఎలాంటి హార్డ్‌ డిస్క్‌లు లేవని స్పష్టం చేసింది. పైగా, సుశాంత్ ఎలా చనిపోయాడో తెలుసుకునేందుకే తాను సీబీఐ విచారణను డిమాండ్ చేసినట్టు తెలిపింది. 
 
ఇదిలావుండగా, సుశాంత్ మృతి కేసు విచారణలో భాగంగా, శుక్రవారం అధికారులు మరోసారి సుశాంత్ ప్రియురాలు రియాను విచారించారు. ఈ సంధర్భంగా రియాపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ముంబైలోని డీఆర్‌డీఓ గెస్ట్‌ హౌజ్‌లో ఉదయం 11 గంటల నుంచి విచారణ కొనసాగుతోంది. దాదాపు గంటన్నర పాటు అధికారులు రియాకు ప్రశ్నలు కురిపించారు. 
 
"సుశాంత్‌ తో పరిచయం ఎలా ఏర్పడింది. ఆ పరిచయం ఎంత వరకు వెళ్లింది. చివరి సారిగా అతనితో మాట్లాడింది ఎప్పుడు. అతని బ్యాంక్‌ ఖాతాల నుంచి డబ్బు ఎవరి ఖాతాలకు వెళ్లింది. సుశాంత్‌ను పెళ్లి చేసుకుందాం అనుకున్నారా?" అంటూ ప్రశ్నలు వేశారు. రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవకర్తిని కూడా అధికారులు విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఘనంగా ఘట్కేసర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 6 వార్షికోత్సవం: ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం