బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును సీబీఐ విచారిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఈ కేసు విచారణను చేపట్టిన సీబీఐ.. గత వారం రోజులుగా ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇందులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే, సీబీఐ కంటే ముందు.. బ్యాంకు ఖాతా నుంచి నిధుల తరలింపుపై సుశాంత్ ప్రియురాలు, బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారించింది. ఈ విచారణలో పలు ఆస్తికరమైన విషయాలు వెలుగు చూసింది. డ్రగ్స్ పేరుతో రియా చక్రవర్తికి నేరుగా సంబంధాలున్నట్లు ఈడీ తేల్చింది.
సుశాంత్ స్నేహితులు కూడా డ్రగ్స్ తీసుకునేవాళ్లని ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో వెల్లడైంది. రియా నేరుగా డ్రగ్స్ వ్యాపారులను సంప్రదించేదని ఈడీ తెలిపింది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి ఈడీ తాజాగా లేఖ రాసింది. అలాగే, రియాకు డ్రగ్స్ డీలర్లకు మధ్య జరిగిన సంభాణలను కూడా ఈడీ అధికారులు సీబీఐ అధికారులతో పంచుకున్నారు.
ఈడీ లేఖతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. సుశాంత్ కేసులో రియాను ఈడీ ఇప్పటికే రెండుసార్లు విచారించింది. కాగా, ఈడీ లేఖతో సుశాంత్ కేసు ఇపుడు కీలక మలుపు తిరిగింది. ఇపుడు రియాను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కూడా అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు లేకపోలేదు.