Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

సుశాంత్ ఆత్మహత్య కేసు.. స్పిర్చువల్ హీలింగ్ ఇచ్చారు.. రియా అరెస్ట్‌కు రంగం సిద్ధం?

Advertiesment
Sushant Singh Rajput
, సోమవారం, 24 ఆగస్టు 2020 (17:20 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు స్పిర్చువల్ హీలింగ్ చేసినట్లు మోహన్ జోషి అనే వ్యక్తి చెప్తున్నాడు. తన చేతి స్పర్శతో సుశాంత్‌కు ట్రీట్మెంట్ ఇచ్చినట్లు మోహన్ జోషి చెప్పాడు. అనుమాస్పదంగా మారిన సుశాంత్ కేసును సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ మానసిక ఒత్తిడిలో ఉన్నాడని, అతనికి చికిత్స చేయాలని రియా తనతో చెప్పినట్లు మోహన్ జోషి తెలిపాడు. 
 
లలిత్ హోటల్ వెనుక ఉన్న వాటర్ రిసార్ట్‌లో సుశాంత్‌కు మానసిక చికిత్స చేసినట్లు జోషి చెప్పాడు. మరుసటి రోజు రియా ఫోన్ చేసి.. చాలా రోజుల తర్వాత సుశాంత్ నవ్వినట్లు చెప్పిందన్నాడు. మరోసారి ట్రీట్మెంట్ కావాలంటే తన ఆఫీసు రావాలంటూ చెప్పానన్నాడు. కానీ వారు రాలేదన్నాడు. సుశాంత్‌ను మళ్లీ చూడలేదని మోహన్ జోషి చెప్పాడు. అయితే జోషి మాటల్లో ఎంత వాస్తవం ఉందో ఇంకా తేలాల్సి ఉన్నది. మాజీ ఎస్‌బీఐ ఉద్యోగి అయిన జోషి.. స్పిర్చువల్ హీలింగ్ కూడా చేస్తుంటాడు.
 
మరోవైపు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి, ఆమె తండ్రికి సీబీఐ సమన్లు జారీ చేసింది. సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న రియాను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏ క్షణమైనా ఆమెను సీబీఐ అరెస్ట్ చేయనుందని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు సుశాంత్‌ది ఆత్మహత్యనా లేక హత్య అన్నదానిపై సీబీఐ విచారణ కొనసాగిస్తుంది.
 
ముంబైలోని సుశాంత్ ఫ్లాట్‌లో సీబీఐ ప్రత్యేక బృందం నేడు డమ్మీ టెస్ట్ నిర్వహించింది. సుశాంత్ ఎత్తు 5 ఫీట్ల 10 అంగుళాలు కాగా ఫ్యాన్‌కు, బెడ్‌కు మధ్య 5 ఫీట్ల 11 అంగుళాల ఎత్తు ఉంది. అపార్ట్‌మెంట్లోని రూఫ్ ఎత్తు 9 ఫీట్ల 3 అంగుళాలు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో అసలు సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదా హత్య జరిగిందా అన్నదానిపై ఆధారాలు సేకరిస్తున్నారు. 
 
సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చెబుతున్న పోస్టుమార్టం రిపోర్టులో ఘటన ఎన్ని గంటలకు జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. దీనిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. సుశాంత్ నివాసం నుంచి దగ్గర్లోనే రెండు హాస్పిటల్స్ ఉన్నా ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్న కూపర్ హాస్పిటల్‌కే సుశాంత్ డెడ్‌బాడీని ఎందుకు తరలించారన్న దానిపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్మ 'మర్డర్‌'కు కోర్టు ముకుతాడు - సినిమా విడుదలకు బ్రేక్