దేశంలోనే అతిపెద్ద రియాల్టీ షోగా పేరగడించిన బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ సీజన్‌కు ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయనతో కలిసి టీవీ యాజమాన్యం బిగ్ బాస్ -4కు మూహుర్తం ఫిక్స్ చేసి, ఓ ప్రోమో రిలీజ్ చేశారు.
ఈ ప్రోమో వీడియో మేరకు బిగ్ బాస్ నాలుగో సీజన్ వచ్చే నెల ఆరో తేదీన సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రముఖ టీవీ చానెల్ స్టార్ మాలో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఛానెల్ యాజమాన్యం ఓ కొత్త టీజర్‌ను విడుదల చేసింది. మూడో సీజన్‌ను హోస్ట్ చేసిన నాగార్జున ఈ నాలుగో సీజన్‌ను కూడా నడిపించనున్నారు.
ఈ సీజన్‌లో పాల్గొనబోతున్నవారికి ముందుగానే కోవిడ్-19 పరీక్షలు చేసి వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. కార్యక్రమం ప్రారంభం కాబోయే ముందు మరోసారి పరీక్షలు చేసి పూర్తి అరోగ్యంగా ఉన్నారని తేలితేనే బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపిస్తారు. కోవిడ్-19 నేపథ్యంలో ఈ సారి మరింత జాగ్రత్తగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సీజన్ 10 వారాలు అంటే 70 రోజులు మాత్రమే నిర్వహించేలా నిర్వహాకులు ప్లాన్ చేశారు.
Keep your TV Remote Ready for Entertainment Like Never Before!!! #WhatAWowWow