Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ నాలుగో సీజన్.. నాగార్జున పుట్టిన రోజున ప్రోమో విడుదల? (video)

Advertiesment
బిగ్ బాస్ నాలుగో సీజన్.. నాగార్జున పుట్టిన రోజున ప్రోమో విడుదల? (video)
, శనివారం, 1 ఆగస్టు 2020 (15:32 IST)
తెలుగులో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 4 త్వరలో రాబోతున్నట్టు స్టార్ మా ప్రకటన చేసింది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఈ షోలో హోస్ట్ చేయనున్న హీరో నాగార్జునపై అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్‌లో బిగ్‌బాస్ సీజన్ 4కు సంబంధించిన టీజర్‌ను షూట్ చేసారు. 
 
ఈ టీజర్‌ను సోగ్గాడే చిన్నినాయన సినిమాను డైరెక్ట్ చేసిన కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసాడు. త్వరలో నాగార్జునతో కూడిన ప్రోమోను విడుదల చేయనున్నారు. తెలుగులో బిగ్ బాస్ షో ప్రోమోనుఆగష్టు 29న నాగార్జున పుట్టినరోజున గ్రాండ్‌గా ప్రసారం చేయాలనే ఆలోచనలో ఉన్నారు స్టార్ మా నిర్వాహకులు. ఇక బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రోమోను 'బాహుబలి' కెమెరామేన్ కెకె సెంథిల్ కుమార్ చిత్రీకరించారు. 
 
ఈ ప్రోమో షూటింగ్ కోసం ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ నిబంధనలను పక్కాగా పాటించారు. త్వరలోనే ఈ ప్రోమో టీవీలలో ప్రసారం కానుందని తెలుస్తోంది. ఈ సీజన్ బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లేవారి జాబితా సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి షోని ప్రసారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఎవరెవరు ఈ షోలో పార్టిసిపేట్ చేస్తారో ఇంకా తేలాల్చి వుంది.
 
సోషల్ మీడియాలో మాత్రం అనేకమంది పేర్లు లీక్ అయ్యాయి. పూనమ్ భజ్వా, శ్రద్దాదాస్, హంసా నందిని, సింగర్ సునీత, మంగ్లీ , హీరో నందు, వైవా హర్ష, అఖిల్ సార్దక్, యామినీ భాస్కర్, మహాతల్లి, అపూర్వ, పొట్టి నరేష్, మెహబూబా దిల్ సే, ప్రియ వడ్లమాని, సింగర్ నోయల్ పేర్లు వచ్చాయి. శ్రద్ధాదాస్ తాను బిగ్ బాస్‌లో పాల్గొనడటం లేదని తెలిపింది. హీరో తరుణ్, యాంకర్లు విష్ణు ప్రియ, ఝాన్సీలు తమకు బిగ్ బాస్‌కి వెళ్లే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Bigg Boss 4: ఆఖరికి కళ్యాణ్ కృష్ణకి ఆ ఛాన్స్ ఇచ్చారా..?