Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

01-08-2020 నుంచి 31-08-2020 వరకు మాస ఫలితాలు

webdunia
శుక్రవారం, 31 జులై 2020 (20:02 IST)
మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక, 1వ పాదం
ఈ మాసం మిశ్రమ ఫలితాలున్నాయి. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. ఖర్చులు విపరీతం. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పదవుల కోసం చేసే యత్నాలు ఫలించవు. వ్యతిరేకులతో సమ్యస్యలెదురవుతాయి. మనోధైర్యంతో వ్యవహరించండి. బంధుమిత్రులతో సత్సబంధాలు నెలకొంటాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు స్థానచలనం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వృత్తుల వారికి సామాన్యం.
 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర, 1, 2, పాదాలు
ప్రతికూలతలు అధికం. ఖర్చులు అదుపులో ఉండవు. ధన సమస్యలెదురవుతాయి. సాయం అర్థించేందుకు మనస్కరించదు. నిస్తేజానికి లోనవుతారు. అవకాశాలు చేజారిపోతాయి. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. గృహమార్పు అంత ఫలితమీయదు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. బాధ్యతగా వ్యవహరించాలి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. విద్యా ప్రకటనలను విశ్వ సించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వ్యపారాలు లాభసాటిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
మిధునరాశి: మృగశిర 3, 4, పాదాలు, ఆర్థ్ర, పునర్వసు, 1, 2, 3 పాదాలు
మీ కష్టం ఫలిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. బంధువత్వాలు బలపడుతాయి. ఆర్థికంగా ఫర్వాలేదు. సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడుతారు. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పత్రాలు అందుకుంటారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. నమ్మకస్తులే మోసగించడానికి యత్నిస్తారు. మీ ప్రమేయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కర్కాటరాశి: పునర్వసు, 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ మాసం శుభదాయకమే. మాటతీరు ఆకట్టుకుంటుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. సాధ్యం కాని హామీలివ్వవద్దు. పరిచయాలు బలపడుతాయి. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. సంతానం ఉన్నత చదువులు వారి ఇష్టానికే వదిలేయండి. వ్వాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. న్యాయ, సేవా, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. విదేశాలలోని ప్రియతముల క్షేమం తెలుసుకుంటారు.
 
సింహరాశి: మక, పుబ్బ, ఉత్తర, 1వ పాదం
అన్నిరంగాల వారికి కలిసివస్తుంది. సంతోషకరమైన సమాచారాన్ని వింటారు. సమస్యలు సద్దుమణుగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. గృహంలో స్తబ్దత తొలగుతుంది. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు ప్రయోజనకరం. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. మనోధైర్యంతో అడుగు ముందుకేయండి. ఉద్యోగస్తులకు పదోన్నతి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ప్రస్తుత వ్వాపారాలే శ్రేయస్కరం. సమావేశాల్లో పాల్గొంటారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
కన్యరాశి: ఉత్తర, 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త, 1, 2 పాదాలు
సమర్థతను చాటుకుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. సంప్రదింపులకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. ఒత్తిళ్లు ప్రలోభాలకు లొంగవద్దు. ప్రణాళికలు రూపొందించుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి.ధనలాభం ఉంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతారు. మీ సాయంతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెద్ద మొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
తులారాశి: చిత్త, 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ, 1, 2, 3 పాదాలు
కార్యానుకూలత, ధనప్రాప్తి ఉన్నాయి. గృహమార్పు కలిసివస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ప్రేమానుబంధాలు బలపడుతాయి, మీ వాక్కు ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉపాధ్యాయులకు స్థానచలనం ఇబ్బంది కలిగిస్తుంది. అధికారులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.
 
వృశ్చికరాశి:విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి. రుణ ఒత్తిళ్లు ఎదుర్కుంటారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. ఎవరినీ నిందించవద్దు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. భేషజాలకు పోవద్దు. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆశావహ దృక్పథంతో మెలగండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లతో జాగ్రత్త. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు తలపెడుతారు.
 
ధనుస్సు రాశి: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, 1 వ పాదం
ఈ మాసం ఏమంత ఉనుకూలం కాదు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చెల్లింపులు, అవసరాలు వాయిదా వేసుకుంటారు. శ్రమాధిక్యత మినహా ఫలితం శూన్యం. బంధుమిత్రుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. చేసిన పనులు మళ్లీ మొదటికే వస్తాయి. కుటుంబీకులు మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. మనోధైర్యంతో ముందుకు సాగండి. సలహాలు, సాయం ఆశించవద్దు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఏమంత ఫలితమీయవు. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
మకరం: ఉత్తరాషాడ,2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్థికస్థితి సామాన్యం. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. అచనాలు ఫలించవు. పెట్టుబడులకు తరుణం కాదు. రుణ ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. మీ తప్పదాలను సరిదిద్దుకోండి. అవకాశాలను వదులలుకోవద్దు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆత్మీయుల సాయం అందుతుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. సంతానం కదలికపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా సమస్యలు పరిష్కరిచుకోవాలి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాలలో స్వల్ప ఒడిదుడుకులు మినహా ఇబ్బంది ఉండదు. అధికారులకు కొత్త బాధ్యతలు. పనిభారం. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
కుంభరాశి: ధనిష్ట, 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. వ్యవహారానుకూలత ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ధనయోగం ఉంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బాధ్యతలు అప్పగంచవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. ప్రత్యర్థుల తీరు ఆందోళన కలిగిస్తుంది. అప్రమత్తంగా మెలగాలి. ప్రభుత్య కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. వ్యాపారాలలో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణకు అనుకూలం. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఆందోళన అధికం.
 
మీనరాశి: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అన్ని రంగాలవారికి యోగదాయకమే. ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడుతాయి. సోదరులతో అవగాహనకు వస్తారు. ఆస్తి వివాదాలు సద్దుమణుగుతాయి. పొదుపు పథకాలు లాభిస్తాయి. ఆదాయం బాగుంటుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. వాయిదా పడిన పనులు ఎట్టికేలకు పూర్తికాగలవు. మీ ప్రమేయంతో ఒకరికి సదావకాశము లభిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. వాహనం ఇతరులకివ్వద్దు.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

వరలక్ష్మీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ