Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యతో బోయపాటి సినిమానా? సింగం శివాలెత్తుతుందిగా...

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (15:42 IST)
Surya
త‌మిళ‌, తెలుగు న‌టుడు సూర్య గురించి అంద‌రికీ తెలిసిందే. సింగం సినిమాతో త‌మిళంలోనేకాదు తెలుగు వారిని బాగా ఆక‌ర్షించాడు. హై ఓల్టేజ్ యాక్ష‌న్ అంటే సూర్య‌నే అనే పేరు వ‌చ్చేసింది. అటువంటి సూర్య‌ను తెలుగులో లాంఛ్ చేయాలంటే... రెండు భాష‌లు స‌రిపోవు. ద‌క్షిణాది భాస‌ల్లో విడుద‌ల చేయాల్సిందే.. ఆ మ‌ధ్య సూర్య ఓ తెలుగు సినిమా చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఆ వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్త‌న‌న్నాడు కూడా. 
 
ఇటీవ‌లే  సూర్య `ఆకాశం నీ హద్దురా` సినిమాతో ఫామ్‌లోకి వచ్చారు. ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రశంసలు అందుకుంది. త్వరలో సూర్య ఓ స్ట్రయిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు స‌మాచారం. మాస్ చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాను తెర‌కెక్కించేందుకు సిద్ధ‌మం కానున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు వీరిద్దరినీ కలిపేందుకు ప్రయత్నిస్తున్నారట.
 
బోయపాటి చెప్పిన హై వోల్టేజ్ యాక్షన్ స్టోరీ సూర్యకు నచ్చింద‌ని ఫిలింన‌గ‌ర్ టాక్‌. దీంతో ఆ సినిమాలో నటించేందుకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తారట. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది.మ‌రి హై ఓల్జేజీ యాక్ష‌న్ అంటే బాల‌య్య‌బాబు, బోయ‌పాటి ఇప్ప‌టివ‌రకు చూశాం. మ‌రి సూర్య కాంబినేష‌న్ ఎలా వుంటుందో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొరుగు గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులతో ప్రేమ... ఇద్దరినీ పెళ్లాడిన యువకుడు!

నరకం చూపిస్తా నాయాలా? టెక్కలిలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తాను : దువ్వాడ శ్రీనివాస్ చిందులు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments