Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అషు రెడ్డిని పైకెత్తుకున్న రాహుల్ సిప్లగింజ్‌.. నెట్టింట వైరల్

Advertiesment
అషు రెడ్డిని పైకెత్తుకున్న రాహుల్ సిప్లగింజ్‌.. నెట్టింట వైరల్
, ఆదివారం, 17 జనవరి 2021 (11:26 IST)
Rahul Sipligunj-Ashu Reddy
బిగ్ బాస్ మూడో సీజన్ విజేత రాహుల్ సిప్లగింజ్‌కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా రాహుల్ సిప్లగంజ్‌తో తనతో పాటు పాల్గొన్న అషు రెడ్డిని పైకెత్తుకున్న ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిగ్‌బాస్ సీజన్ 3లో పాల్గొన్న అషు రెడ్డి.. అదే సీజన్‌లో విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్‌ను ఓ సందర్భంలో కలిసింది. 
 
ఈ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్‌.. అషు రెడ్డిని సరదగా పై ఎత్తుకున్నాడు. అంతేకాదు ఆ రొమాంటిక్ ఫోటోను రాహుల్ సిప్లిగంజ్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. నిజమైన స్నేహితుడికి మన బలం ఏమిటో.. బలహీనత ఏమిటో తెలుసు. అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. 
 
మొత్తంగా అషురెడ్డిని రాహుల్ సిప్లిగంజ్ ఎత్తుకున్న ఈ ఫోటోపై సోషల్ మీడియాలో మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. మొత్తంగా అషు రెడ్డి, రాహుల్ సిప్లిగంజ్ ఈ రొమాంటిక్ పిక్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు. 
 
ఇకపోతే, తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌ 3లో విజేతగా నిలిచి సంచలనం సృష్టించాడు హైదరాబాదీ పాతబస్తీ యువకుడు రాహుల్ సిప్లిగంజ్. బిగ్‌బాస్ షోలో అతని నిజాయితీ, ముక్కుసూటి తనంతో ఆకట్టుకొని విజేతగా నిలిచి ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయాడు. ముఖ్యంగా బిగ్‌బాస్ హౌస్‌లో తన తోటి కంటెస్టెంట్ పునర్నవితో ప్రేమాయణం ఇతనికి బాగానే కలిసొచ్చింది. 
 
అంతకుముందు ఎన్నో ప్రైవేటు ఆల్బమ్స్‌లో పాటల పాడినా రాని పేరు బిగ్‌బాస్‌తో వచ్చింది. అయితే ఆ మధ్య రాహుల్ సిప్లిగంజ్‌పై ఓ పబ్‌లో దాడి జరిగిన ఘటనతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇపుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'రంగ మార్తాండ' సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు.
 
మరోవైపు బిగ్‌బాస్ 3 షోలో తనదైన స్కిన్ షోతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది అషు రెడ్డి. చూడ్డానికి అచ్చం హీరోయిన్ సమంతాలా కనిపించే ఈమె.. తక్కువ వ్యవధిలోనే సెన్సేషన్ అయిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆచార్యలో రామ్ చరణ్ లుక్ రిలీజ్.. సిద్ధ పాత్రలో చెర్రీ