Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతార మాజీ ప్రియుడితో చందమామ రొమాన్స్..?

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (15:11 IST)
చందమామ కాజల్ అగర్వాల్ నటన, గ్లామర్ పంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్.. ముంబై వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

సాధారణంగా పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగు పెట్టిన హీరోయిన్లు సినిమాల్లో వేగం తగ్గించడం వల్ల వారికి అవకాశాలు తగ్గుతాయని అందరూ అభిప్రాయపడుతుంటారు.

కానీ కాజల్‌ మాత్రం చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. అలా అని పూర్తిగా సినిమాలకే అంకితం కాకుండా అటూ భర్త కిచ్లుకు కూడా తగినంత సమయాన్ని కేటాయిస్తున్నారు. 
 
ఇటూ వైవాహిక బంధాన్ని.. అటూ  సినీ కెరీర్‌ను బాగానే మేనేజ్‌ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ భామ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి సరసన నటిస్తోన్న సంగతి తెలిసిందే. దీనితో పాటు కమల్‌ హాసన్‌‌ ‘ఇండియన్‌-2’లో కూడా నటిస్తున్నారు. 
 
తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్‌, నటుడు, దర్శకుడు ప్రభుదేవతో మొదటిసారిగా జతకట్టనున్నట్లు తెలుస్తోంది. తమిళ చిత్రం ‘గులేబకావలి’ ఫేం డి. కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ‌ రొమాంటిక్‌, కామెడీ, థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కనుందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

జాతర ముసుగులో అసభ్య నృత్యాలు.. నిద్రపోతున్న పోలీసులు (Video)

ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - తితిదే నిర్ణయం

బ్రో అని పిలిచినందుకు - స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఇంటి యజమాని దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments