చైనా దిగ్గజం ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా రెండు నెలలుగా కనిపించకుండా పోవడం కార్పొరేట్ ప్రపంచంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ అదృశ్యం వెనకు చైనా ప్రభుత్వ హస్తం ఉందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో చైనా అధికారిక మీడియా బుధవారం ఓ వీడియోను విడుదల చేసింది. జాక్‌మా వందమంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ఉపాధ్యాయులతో వర్చువల్ భేటీ నిర్వహిస్తున్నారంటూ చైనా అధికారిక మీడియా ఓ వీడియోను రిలీజ్ చేసింది.
"కరోనా మహమ్మారి ముగిన తర్వాత మళ్లీ మనం కలుద్దాం" అని ఆ గ్రామీణ ఉపాధ్యాయులతో జాక్ మా అన్న వీడియోను గ్లోబల్ టైమ్స్ చూపించింది. అయితే వ్యాపారవేత్తలు మాత్రం ఈ వీడియోపై కొంత సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా టీవీ షోలకు గానీ, సోషల్ మీడియాకు గానీ జాక్‌మా దూరంగా ఉంటారని వారు పేర్కొంటున్నారు. హఠాత్తుగా జాక్‌మా ఇలా సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడమేంటని ప్రశ్నిస్తున్నారు.
జాక్ మా పబ్లిక్ మీటింగులలో, బహిరంగ కార్యక్రమాల్లో కనపడి. అక్టోబరులో చైనా ప్రభుత్వ ఆర్థిక విధానాలపై, బ్యాంక్ రెగ్యులేటరీలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో జాక్ మాపై చైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయన వ్యాపారాలపై విచారణకు ఆదేశించింది. అయితే ఆ సమావేశం తరువాత జాక్ మా మళ్లీ బయట ఎక్కడా కనపడలేదు.