Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నీ లియోన్ భర్త అదుర్స్.. ఆ మహిళకు భలే సాయం చేశాడుగా..?!

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (18:08 IST)
దారిన పోతూ వుంటే ఎవరికి ఏమైనా అయితే పట్టించుకోకుండా.. తనపని తాము చూసుకుపోయేవారు చాలామంది వున్నారు. కానీ ఓ సెలెబ్రిటీ మాత్రం ఓ మహిళకు సాయం చేశారు. ఆయన ఎవరో కాదు.. సన్నీ లియోన్ భర్త. 
 
వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ తార సన్నీ లియోన్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమానికి తన భర్త డేనియల్ వెబర్‌తో వెళ్లింది. అవార్డుల ఫంక్షన్‌ ముగిశాక శనివారం రాత్రి ఇద్దరూ కారులో ఇంటికి తిరిగి వస్తుండగా.. దారిలో రోడ్డు మీద ఓ మహిళ తన కారు టైర్‌ మార్చేందుకు తెగ ఇబ్బందులు పడటం డేనియల్‌ కంట పడింది. అంతే వెంటనే ఆయన కారు ఆమె వద్దకు వెళ్లి సాయం చేశారు. 
 
అతడి హెల్పింగ్‌ నేచర్‌కు ముచ్చటపడిపోయిన సన్నీ 'ట్రూ జెంటిల్‌మెన్‌' అంటూ దీన్నంతటినీ వీడియో తీసి షేర్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు 'వావ్‌.. మీరెంత మంచివాళ్లు' అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 
'ఇందుకే మీరు మా అందరికీ ఫేవరెట్‌ కపుల్'‌ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా సన్నీ, డేనియల్‌ 2011లో వివాహం చేసుకున్నారు. వీళ్లు నిశా అనే అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. సరోగసీ ద్వారా ఇద్దరు మగ కవలలు నోవా, అశెర్‌కు జన్మనిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం గంగా నదిలో దిగింది, చూస్తుండగానే కొట్టుకుపోయింది (video)

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

నాకు తియ్యని పుచ్చకాయ కావాలి, చెప్పవే చాట్‌జీపీటీ (Video)

మంత్రివర్గం కీలకమైన సమావేశం- పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments