Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త స్నేహితుడే ప్రియుడయ్యాడు, నా భర్త అడ్డు తొలగించు మనకిక స్వర్గమే అంది, అంతే...

Advertiesment
భర్త స్నేహితుడే ప్రియుడయ్యాడు, నా భర్త అడ్డు తొలగించు మనకిక స్వర్గమే అంది, అంతే...
, శనివారం, 27 మార్చి 2021 (19:41 IST)
ఏదో చిన్న వ్యాపారం, అందమైన భార్య, హాయిగా జరిగిపోయే కాపురం. ఉన్నదాంట్లో ఆ జంట చిలకాగోరింకల్లా హాయిగా కాపురం చేసుకుంటున్నారు. ఐతే ఇటీవల ఓ పెళ్లికి ఈ జంట హాజరైంది. అదే పెళ్లికి వచ్చాడు భర్త స్నేహితుడు. అక్కడ తన స్నేహితుడితో పాటు అతడి పక్కనే వున్న అందమైన అతడి భార్యను కూడా చూసాడు. కన్నేశాడు.

ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలనుకున్నాడు. అతడు అనుకున్నట్లే ఆమె అతడికి లొంగిపోయింది. పూర్తిగా అతడి వశమైంది. భర్త ఇంట్లో లేని సమయంలో అతడికి స్వర్గం చూపిస్తోంది. తన భర్త అడ్డు తొలగిస్తే ఇక మన సంతోషానికి ఎవరూ వుండరని ప్రియుడితో చెప్పింది. అన్నంత పని చేసేసారు.
 
పూర్తి వివరాల్లోకి వెళితే... బెంగళూరులోని గౌస్‌నగర్‌లో 35 ఏళ్ల మహ్మద్ షఫీ, 29 ఏళ్ల తస్లీమ్ బాను జంట నివాసం వుంటున్నారు. భర్త చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. డబ్బులు బాగానే వస్తున్నాయి. భార్యకు ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నాడు. ఐతే ఇటీవలే తమ బంధువుల పెళ్లికి ఈ జంట హాజరైంది. అక్కడికి రియల్ ఎస్టేట్ చేస్తున్న షఫీ స్నేహితుడు అప్సర్ ఖాన్(41 ఏళ్లు) కూడా వచ్చాడు. స్నేహితుడిని పలుకరిస్తూనే అతడి పక్కనే వున్న భార్యపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా అనుభవించాలని నిర్ణయించుకున్న అఫ్సర్ ఖాన్ ఓ పథకం వేశాడు.
 
మరుసటి రోజే నేరుగా స్నేహితుడు షఫీ ఇంటికి వచ్చాడు. తను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాననీ, అందులో పెట్టుబడి పెడితే వెంటనే కమీషన్ ఇస్తానని నమ్మబలికాడు. రూ. 70 లక్షల విలువ చేసే వెంచర్లో పెట్టుబడి పెడితే రూ. 5 లక్షలు కమీషన్ ఇస్తానన్నాడు. స్నేహితుడు మాటను నమ్మిన షఫీ డబ్బు పెట్టుబడి పెట్టాడు. మరుసటి రోజే అఫ్సర్ ఖాన్ స్నేహితుడిని పిలిచి రూ. 5 లక్షల కమీషన్ ముట్టజెప్పాడు. దాంతో షఫీకి నమ్మకం కుదిరింది.
 
అలా అతడి వద్ద డబ్బు తీసుకుంటూ కమీషన్ ఇస్తానంటూ తరచూ ఇంటికి రావడం మొదలుపెట్టాడు. అలా షఫీ భార్య తస్లీమ్ బానుతో మాట కలిపాడు. ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత తీయటి మాటలు చెబుతూ.. ఆమెను తన దారిలోకి తెచ్చుకున్నాడు. భర్త షఫీ వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్లగానే అఫ్సర్ ఖాన్ ఎంట్రీ ఇచ్చేవాడు. ఇద్దరూ శృంగారంలో మునిగిపోయేవారు. ఇంటికి గడియపెట్టి మరీ అఫ్సర్ ఖాన్ లోపల గంటల తరబడి వుంటుండటంతో ఇరుగుపొరుగువారికి అనుమానం వచ్చింది. విషయాన్ని షఫీ చెవికి చేరవేశారు.
 
భార్య బానుని మందలించాడు షఫీ. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. భర్తకు నిజం తెలిసిపోవడంతో ఇక అతడి అడ్డు తొలగించేయాలని బాను నిర్ణయించింది. రూ. 1 లక్ష రూపాయలు ఇస్తా... నా భర్తను హత్య చేయించు అని ప్రియుడు అఫ్సర్ ఖాన్‌కి చెప్పింది. ప్రియురాలి నుంచి అలాంటి మాట కోసమే ఎదురుచూస్తున్న అఫ్సర్ ఖాన్ వెంటనే రంగంలోకి దిగాడు. రూ. 5 లక్షలకు ఓ కిల్లర్ గ్యాంగ్‌కి సుపారీ ఇచ్చాడు. దారుణం ఏంటంటే.. ఆ ఐదు లక్షల రూపాయలు కూడా షఫీ నుంచి తీసుకున్నాడు. అనుకున్న ప్రకారం మార్చి 17న కమీషన్ ఇస్తాను, టింబర్ డిపోకి రమ్మంటూ ఫోన్ చేశాడు.
 
డబ్బుకోసం టింబర్ డిపో వద్దకు వెళ్లిన షఫీని కిల్లర్ గ్యాంగ్ అత్యంత దారుణంగా నరికి చంపేసి పరారయ్యారు. ఆ తర్వాత తమకు ఏమీ తెలియనట్లు ఎవరో హత్య చేసారంటూ గుండెలు బాదుకుంది బాను. కానీ షఫీ తండ్రి తన కోడలిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేశారు. దాంతో తన భర్తను ప్రియుడు అఫ్సర్ ఖాన్‌తో కలిసి హత్య చేసినట్లు అంగీకరించింది.
 
అరెస్టయిన వారిలో మృతుడి భార్య తస్లీమ్ బాను (29), అఫ్సర్ ఖాన్(41)తో పాటు కిల్లర్ గ్యాంగ్ పాషా (26), సయ్యద్ వసీం(26), వెంకటేష్(19), భరత్(18), చేతన్(19), ఇబ్రహీం(19) మరో మైనర్ బాలుడు వున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'లజాడా' సైట్‌లో ఐఫోన్ బుకింగ్... పార్శిల్ విప్పిచూస్తే...