Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాడే స్థాయి నుంచి జ‌డ్జిగా ఎదిగిన సునీత‌

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (17:02 IST)
Sunita, charan
మహా గాయకుడు ఎస్పీబాల సుబ్ర‌హ్మ‌ణ్యంకు ఎన్నో ఏళ్లుగా కొత్త గాయ‌నీగాయ‌కులుగా ప‌రిచేసే ప్రోగ్రామ్‌ను ప్ర‌ముఖ టీవీ సంస్థ ఈటీవీ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. దీని ద్వారా ఎంతోమంది ఔత్సాహిక క‌ళాకారుల‌ను వెలుగులోకి తెచ్చింది. ఆ అవ‌కాశం నా ద్వారా రావ‌డం పూర్వ‌జ‌న్మ సుకృతంగా భావిస్తున్న‌ట్లు ఎస్‌.పి. బాలు చెప్పేవారు. పాట‌లు పాడితే వారి గాత్ర శుద్ది, బీజం, ఆరోహ‌ణ‌, అవ‌రోహ‌ణ‌, దీర్ఘాలు, ప‌దాల‌ను నొక్కి పెట్ట‌డం వంటి వెన్నో మెళుకువ‌ల‌ను కూలంక‌షంగా వారికి విశ‌దీక‌రించేవారు. ఆయా పాట‌ల‌తో త‌న‌కున్న అనుభ‌వాల‌ను సంగీత ద‌ర్శ‌కుల‌తో త‌న‌కున్న ప‌రిచ‌యాల‌ను, పాట పాడే సంద‌ర్భానుసార విష‌యాల‌ను వెల్ల‌డిస్తూ కార్య‌క్ర‌మాన్నిర‌క్తిక‌టించారు. ఇక ఆయ‌న త‌ర్వాత అలాంటి వ్య‌క్తి ఎవ‌రు వ‌స్తారా? అనే ప్ర‌శ్న అప్ప‌ట్లోనే చాలామందిలో నెల‌కొనేది.
 
తాజాగా ఆ అవ‌కాశం మ‌ర‌లా పాడుతా తీయ‌గా ద్వారా ఎస్‌.పి. బాలు త‌న‌యుడు ఎస్‌.పి. చ‌ర‌ణ్‌కు ద‌క్కింది. ఇది ఈనెల‌లోనే ఆదివారం టెలికాస్ట్ కానుంది. ఇప్ప‌టికే గ్రౌండ్ వ‌ర్క్ అంతా పూర్త‌యింది. జూన్ 4న ఎస్‌.పి. జ‌యంతి. జూన్‌5వ తేదీన పాడుతా తీయ‌గా స‌రికొత్త హంగుల‌తో వ‌స్తుంద‌ని సంస్థ ప్రోమో విడుద‌ల చేసింది. విశేషం ఏమంటే ఇందులో ఒక‌ప్పుడు పాట‌ల పోటీలో పాల్గొన్న సునీత జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇది త‌న‌కు ద‌క్కిన అపూర్వ‌మైన అవ‌కాశ‌మ‌నీ, మాట‌లు అంద‌డంలేద‌ని పేర్కొంది. ఈ సంద‌ర్భంగా గాన గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాలుకు మ‌రోసారి శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్న‌ట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

waterfalls: కొడుకును కాపాడిన తండ్రి.. జలపాతంలోనే మునక... ఎక్కడ?

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు డెడ్ లైన్ లేదు.. పెళ్లి ఫోటో అక్కర్లేదు : మంత్రి నాదెండ్ల

విజయసాయి రెడ్డి ఓ చీటర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments