Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌దిమందికి ఉపాధినిస్తూ సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్న సుమ కనకాల

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (19:21 IST)
Suma Kanakala, Dr. Pramila, Dr. Chinababu
బిజీ యాంక‌ర్‌గా వున్న సుమ క‌న‌కాల త‌ను సంపాదించ‌డ‌మేకాదు, ప‌దిమందికి జీవ‌నోపాధిని క‌ల్గించ‌డ‌మే కాకుండా ప‌లువురికి సేవ చేయ‌డం త‌నకు ద‌క్కిన గౌర‌వంగా భావిస్తోంది.
 
సుమ కనకాల యాంకర్ గా, నటిగా గత 20 ఏళ్లుగా మన ఇంటి ఆడపడుచులా మనందరితో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 'ఫెస్టివల్స్ ఫర్ జాయ్' అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్టాపించారు ఆమె. దసరా సందర్భంగా ప్రారంభమైన ఈ సంస్థ... ప్రజ్వల అనే ప్రముఖ సేవా సంస్థ అధినేత సునీత కృష్ణన్ సంరక్షణలో ఉన్న పది మంది మహిళలకు జీవనోపాధి కల్పించడానికి ఆర్థిక సహాయం, అక్కడే  ఉంటున్న పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ ఏర్పాటు చేసారు. 
 
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన చిత్ర పరిశ్రమ కు చెందిన 10 మంది మహిళలకు ఏడాది పాటు నిత్యావసర వస్తువులను, వారికి అవసరమైన మెడిసిన్ అందించారు. తాజాగా ఈరోజు అనగా ఆదివారం నాడు  రానున్న క్రిస్మస్ సందర్భంగా మొదటిసారి ఆరోగ్య పరిరక్షణ కోసం గ్రేస్ ఫౌండేషన్, తానా సహకారంతో చిత్ర, టెలివిజన్ పరిశ్రమలకు చెందిన 250 మందికి  క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌ను నిర్వహించారు.


ఈ స్క్రీనింగ్‌లో 10 మందికి క్యాన్సర్ లక్షణాలు కనిపించాయని గ్రేస్ ఫౌండేషన్ వైద్యులు డాక్టర్ ప్రమీల, డాక్టర్ చినబాబు తెలిపారు. ఈ 10 మందికి మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమ కనకాల, డాక్టర్ చినబాబు, డాక్టర్ ప్రమీల, తానా తరపున తానా ట్రస్టీ విద్య గారపాటి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments