Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోయ‌పాటి, బాలకృష్ణ ఎన‌ర్జీనే ఫైట్స్‌కు వ‌న్నె తెచ్చాయి- అఖండ ఫైట్ మాస్ట‌ర్ స్ట‌న్ శివ‌

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (19:02 IST)
Sten Shiva, Kevin, Steven
చెన్నైలో  బైక్‌, లోనా మెకానిక్ లు చేసుకుంటూ వుంటే శివకు న‌టుడు అవ్వాల‌నే కోరిక వుండేది. అలా ఒక‌టి అరా సినిమా చేశాడు. ఇప్పుడు ఏకంగా ఎఫ్ 3లో కామెడీ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఇంకోవైపు అనుకోకుండా స్ట‌న్ శివ ఫైట‌ర్‌గా మారాడు. ఇప్పుడు ఏకంగా `అఖండ‌` సినిమాకు అఘోరా పాత్ర చేసే యాక్ష‌న్ సీన్స్ అన్నీ తానే చేశాడు. ఈ యాక్ష‌న్ కు సినీరంగంలో త‌న‌కు మ‌రింత గౌర‌వం వచ్చింద‌ని చెబుతున్నారు. ఆయ‌న‌కు తోడుగా ఆయ‌న ఇద్ద‌రు కుమారులు  కెవిన్, స్టీవెన్ కూడా అఖండ యాక్ష‌న్ కు మెరుగులు దిద్దారు. ఈ సంద‌ర్భంగా ఆ విశేషాల‌ను ముగ్గురూ ఇలా తెలియ‌జేస్తున్నారు.
 
స్టంట్ శివ మాట్లాడుతూ..‘అఖండ సినిమాలో అఘోర ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు నేను ఫైట్స్ కంపోజ్ చేశాను. ఈ ఫైట్స్ ఇంత బాగా రావడానికి బోయపాటి శ్రీను గారు, బాలకృష్ణ గారు కారణం. ప్రతీ సినిమాకు కూడా బాగా ఫైట్స్ కంపోజ్ చేయాలి, అవార్డులు రావాలనే చేస్తాం. ఆ హీరో ఆ మూడ్‌లో వచ్చి మాస్టర్ చెప్పినట్టుగా చేస్తే అది కుదురుతుంది. బాలయ్య బాబు గారు అద్బుతంగా చేశారు. ఈ సినిమా కోసం 80 రోజులు పని చేశాను. 60 నుంచి 65 కేవలం యాక్షన్ సీక్వెన్స్ కోసమే చేశాను. మిగిలిన రోజుల్లో ఎలివేషన్స్ గురించి దర్శకుడితో ప్రయాణం చేశాను. 
- ఇది వరకు నేను సింహా సినిమాకు ఇంట్రడక్షన్ ఫైట్ చేశాను. బోయపాటి గారు వేరే లెవెల్. ఆయన కథ చెప్పిన విధానం విన్న తరువాత..ఫైట్స్ ఎలా కంపోజ్ చేయాలా అని నా కుమారులిద్దరితో కలిసి ఆలోచించాను. అఘోరా అంటే మామూలు మనిషి కాదు.. తెలుగు ఇండస్ట్రీ అంటే మాస్, మంచి యాక్షన్ సీక్వెన్స్ కోరుకుంటారు. అందులోనూ బాలయ్య గారంటే వేరే లెవెల్ ఉండాలి. డిఫరెంట్‌గా ఉండాలని ఇలా డిజైన్  చేశాం. బోయపాటి గారి ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్ ఓ ఫైట్ మాస్టర్‌లానే ఉంటుంది. ఫైట్స్ ఇంత బాగా రావ‌డానికి నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి గారు కూడా ఎంతో స‌పోర్ట్ చేశారు. నా కొడుకులు ఈ సినిమాకు మంచి ఐడియాస్ ఇచ్చారు. మధ్యలో వాళ్లు ఇచ్చిన ఐడియాలు చూసి లోలోపల ఈర్ష్యపడ్డాను. మంచి ఐడియాస్ ఇచ్చినప్పుడు నేను తీసుకున్నాను.
 
- తెలుగు ఆడియెన్స్ ఫుల్ మాస్. కొడితే అవతల పడిపోవాలని అనుకుంటారు. తమిళ్‌లో అలా కుదరదు. కానీ రజనీకాంత్ వంటి హీరోలకు మాత్రం అక్కడ కూడా అలా సెట్ అవుతుంది. బాలయ్య బాబు నుంచి ఏం కోరుకుంటారో అది ఇవ్వాల్సిందే. ఆయనతో నాలుగు సినిమాలకు పని చేశాను. ఈ ఫైట్లు ఇంత క్లిక్ అవ్వడానికి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కారణం. ఆయన ఇచ్చిన ఆర్ఆర్ వల్లే ఇంత బాగా ఎఫెక్ట్‌ వచ్చింది. మాకు ఫైట్స్ విషయంలో ఏం కావాలన్నా డైరెక్టర్ బోయపాటి గారిని అడిగేవాళ్లం. వెంటనే ఆయన మాకు సమకూర్చేవారు. క్లైమాక్స్‌ను వంద మందితో తీశాం. మేం ఈ సినిమాకు ఫైట్ మాస్టర్స్‌లా పని చేయలేదు. ఫ్యాన్స్‌లా పని చేశాం. బాలయ్య గారిలో ఓ పవర్ ఉంది. డెడికేషన్, క్రమశిక్షణ, టైమింగ్ మాకు చాలా ఇష్టం. ఇండియన్ సినిమాకు బాలయ్య ఓ సూపర్ హీరో. ఇక్కడ నేను నటుడిగా బిజీగా అవుతున్నాను. ఎఫ్ 3లో నేనే మెయిన్ విలన్. క్రాక్ తరువాత నటుడిగా ఆఫర్లు వస్తున్నాయి’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అబద్ధాలను అందంగా చెప్పడంలో జగన్ మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: వైఎస్ షర్మిల

యువతిని పొట్టనబెట్టుకున్న పెద్దపులి.. పొలాల్లో పనిచేస్తుండగా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments