రష్మీ గౌతమ్ నా జీవితం.. స్క్రీన్‌పై నా హీరోయిన్ ఆమే: సుడిగాలి సుధీర్

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (15:07 IST)
సోషల్ మీడియాలో సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్‌ల‌పై బోలెడన్నీ వదంతులు పుట్టుకొస్తాయి. తాజాగా, సుధీర్ అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అలీ వేసిన ఓ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. స్క్రీన్‌పై తన హీరోయిన్ రష్మీ మాత్రమేనని, ఎవ్వరూ వచ్చినా ఒప్పుకోనని, తను నా లైఫ్ అని వ్యాఖ్యానించాడు. రష్మీ వల్లే తనకు ఇంత పేరు వచ్చిందని, ఓ రకంగా తాను స్టార్‌డమ్ సంపాదించడానికి రష్మీనే కారణమని వెల్లడించాడు.
 
ఒకప్పుడు తాము సెట్‌లో మాత్రమే కలిసేవాళ్లమని.. ఈ మధ్య అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడుకుంటామని తెలిపాడు. కెమెరా వెనకాల కూడా రష్మీ తిడుతుందా అని అలీ అడగ్గా.. ఇష్టమొచ్చినట్లు తిడుతుందని చెప్పాడు. తెలుగు రాదు కదా అని అడగ్గా.. వచ్చిన భాషలో తిడుతుందని వెల్లడించాడు. 
 
రష్మీ తన జీవితంలో ఎన్నో కష్టాలు పడిందని, ఆమె పడ్డ కష్టాలు తెలిశాక ఆమెపై గౌరవం అమాంతం పెరిగిందని సుధీర్ చెప్పాడు. ఆమె పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కిందని తాను అనుకుంటున్నానని వివరించాడు. కాగా, జబర్దస్త్‌ను విడిచిపెడతావని వార్తలు వచ్చాయని అలీ అడగ్గా.. తాను దాన్ని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments