Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూనమ్ కౌర్ ట్వీట్.. నిర్భయకు 16న న్యాయం జరగబోతోంది..

Advertiesment
poonam kaur
, మంగళవారం, 10 డిశెంబరు 2019 (11:41 IST)
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. మహిళా సమస్యలపై స్పందించే పూనమ్ కౌర్.. తాజాగా ఢిల్లీలో నిర్భయ తల్లి ఆశాదేవని కలుసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఆమెకు హోటల్‌లో ట్రీట్ కూడా ఇచ్చింది. అంతేకాదు ఆశాదేవితో కలిసి ఉన్న ఫోటోను తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.
 
ఈ నెల 16న నిర్భయకు న్యాయం జరగబోతుంది. ఆమెను అత్యంత క్రూరంగా చంపిన మానవ మృగాలకు ప్రభుత్వం చట్ట ప్రకారం ఉరి తీయబోతున్నారంది. ఆ రోజున భారత దేశం ఎంతో సంతోషంగా ఉంటుందని వ్యాఖ్యానించింది.
 
ఇకపోతే.. నిర్భయ మరణానికి కారణమైన వారిని ఉరి తీయడం ఖాయమైనందునే పూనమ్ కౌర్.. ఆశాదేవికి ట్రీట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉరి తీసే సందర్భాన్ని తాను ఆస్వాదిస్తానని పూనమ్ పేర్కొంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నూర్ అహ్మద్ కుటుంబానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పది లక్షల విరాళం