సోషల్ మీడియాలో సెటైర్లు.. #NithyanandaSwami వీడియో వైరల్

బుధవారం, 11 డిశెంబరు 2019 (11:35 IST)
సోషల్ మీడియాలో నిత్యానంద వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోపై జోకులు పేలుస్తున్నారు. నిత్యానంద విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో సెటైరికల్ జోకులు పేల్చే ఆయుధంగా మారిపోయింది. నిత్యానంద ప్రస్తుతం విదేశాలకు పారిపోయాడు.

ఈ మధ్యే ఈక్వెడార్‌లో ఓ దీవిని కొనేసి, కొత్త దేశం క్రియేట్ చేసినట్లు చెప్పుకున్న నిత్యానందకు... అంత సీన్ లేదనీ, అసలు తాము ఏ దీవినీ నిత్యానందకు అమ్మలేదని ఈక్వెడార్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
అంతేగాకుండా.. ఆశ్రయం కోసం నిత్యానంద చేసుకున్న శరణార్థి దరఖాస్తును తిరస్కరించింది. వెంటనే నిత్యానంద అజ్ఞాతంలోకి చెక్కేశాడు. తాజాగా ఆయన మాట్లాడుతున్న ఓ వీడియో రిలీజైంది. అందులో నిత్యానంద చెప్పిన మాటలు విని ఆయనకు పిచ్చి బాగా ముదిరిందనీ, వెంటనే ఎవరికైనా చూపించాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
 
ఆ వీడియోలో నిత్యానందా ఏమన్నాడంటే.. తనను ఎవరూ టచ్ చేయలేరని చెప్పాడు. ఏ స్టూపిడ్ కోర్టూ తనను ప్రాసిక్యూట్ చేయలేదు. తాను పరమశివుడిని అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేసి నవ్వుకోండి. 

"No judiciary can touch me. M param shiva"
: #NithyanandaSwami from an undisclosed location. pic.twitter.com/WXdZ6bGCdO

— Divesh Singh (@YippeekiYay_DH) November 22, 2019

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేశారా.. లేదంటే..?