Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుధీర్ ఎక్కువగా సిగ్గుపడుతుంటారు.: గెహ్నా సిప్పి

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (17:28 IST)
Gehna Sippi
సుడిగాలి సుధీర్ హీరోగా న‌టిస్తోన్న ప‌క్కా మాస్అండ్‌యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `గాలోడు`. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా నటిస్తోంది.  రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ నిర్మిస్తోంది.ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైలర్‌, పాటలకి విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోన్న సందర్భంగా హీరోయిన్ గెహ్నా సిప్పి మీడియాతో ముచ్చటించారు.
 
- నేను ముంబైలో పుట్టి పెరిగాను. బీకాం చదివాను. ఎక్కువగా కాలేజ్‌కు వెళ్లేదాన్ని కాదు. నా ఫోకస్ అంతా కూడా సినిమాల మీదే ఉండేది. ఇంట్లో వాళ్లు కూడా ఎక్కువగా చదవమని ఒత్తిడి చేసేవాళ్లు కాదు. నా ఫోటోలు, వీడియోలు చూసి నాకు ఈ అవకాశం ఇచ్చారు. సోషల్ మీడియాలో మెసెజ్‌లు పెట్టారు. నేను ముంబైలో ఉండేదాన్ని. నా ఫోటోల ద్వారానే నాకు తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. ఇక్కడకు వచ్చి ఫోటో షూట్లు చేశాను. అలా నాకు ఈ గాలోడు సినిమా ఆఫర్ వచ్చింది.
 
- గాలోడు అంటే మొదట్లో నాకు అర్థం తెలియదు. కానీ ఇప్పుడు నాకు తెలిసింది. గాలోడు అంటే వేస్ట్ ఫెల్లో అని మా డైరెక్టర్ చెప్పారు. నేను ఇందులో నేను ఓ అమ్మకూచి, నాన్నకూచిలాంటి పాత్రను పోషించాను. కాలేజ్ గర్ల్‌, క్యూట్ గర్ల్‌గా కనిపిస్తాను. 
 
- సుధీర్ ఎక్కువగా సిగ్గుపడుతుంటారు. ఆయన చాలా మంచి వ్యక్తి. అందరూ కంఫర్టబుల్‌గా ఉండేట్టు చూసుకుంటారు. సీన్స్ గురించి, డైలాగ్స్ గురించి చర్చిస్తుంటారు. షూటింగ్‌ కంటే ముందు.. జబర్దస్త్ షోను, సుధీర్ స్కిట్లు చూశాను.
 
= శేఖర్ కమ్ముల గారితో పని చేయాలని ఉంది. ఆయన తీసిన ఫిదా సినిమా అంటే నాకు చాలా ఇష్టం. లవ్ స్టోరీలంటే నాకు చాలా ఇష్టం. సుకుమార్ గారంటే నాకు చాలా ఇష్టం.
 
- హీరోల్లో ధనుష్ సర్ అంటే చాలా ఇష్టం. నాగ చైతన్య, రామ్ చరణ్‌లంటే చాలా ఇష్టం. నాని భలే భలే మగాడివోయ్, నితిన్ ఇష్క్ సినిమా ఇలా నాకు చాలా ఇష్టం. నాకు తెలుగు సినిమాలన్నా, మాస్ స్టెప్పులన్నా, ఐటం సాంగ్స్ అన్నా చాలా ఇష్టం.
 
నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో ఐదు పాటలుంటాయి. నేను మూడు పాటల్లో కనిపిస్తాను. ప్రతీ సినిమాకు మ్యూజిక్ ప్రాణంగా నిలుస్తుంది. ఈ చిత్రంలోనూ పాటలు బాగుంటాయి. పాటలు బాగుంటే నేను పాడతాను.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments