Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెబ్బాపటేల్‌ ఐటమ్‌సాంగ్‌ ను పాడిన మంగ్లీ (video)

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (17:14 IST)
heppapatel, indrasena
కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలతో సంగీత దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పాపులర్ మ్యూజిక్ దర్శకుడు రవిబసుర్. కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలకు రవిబసుర్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించింది. ఇక కేజీఎఫ్-2 తరువాత రవిబసుర్ సంగీతం అందిస్తున్న మరో పాన్‌ఇండియా చిత్రం శాసనసభ. ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. 
 
కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ *ప్రత్యేక పాటను విడుదల చేసింది చి*త్రబృందం. హెబ్బాపటలే్‌ నటించిన ఈ ఐటమ్‌సాంగ్‌ను *ప్రముఖ గాయనీ మంగ్లీ ఆలపించారు.ఈ చిత్రం విశేషాలను నిర్మాత షణ్ముగం సాప్పని తెలియజేస్తూ  పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి రవిబసుర్ అందిస్తున్న సంగీతం, నేపథ్యసంగీతం మెయిన్‌పిల్లర్‌గా వుంటుంది. ఆయనతో పనిచేయడం ఎంతో గర్వంగా వుంది. శాసనసభ విషయంలో ఆయన చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధతో ఎంతో అద్బుతంగా అవుట్‌పుట్ వచ్చింది.కేజీఎఫ్-2 తరువాత తెలుగులో ఆయన నుంచి వస్తున్న చిత్రమిది. హెబ్బాపటేల్‌ *ప్రత్యేకపాట చి*త్రంలో ఎంతో కలర్‌ఫుల్‌గా వుంటుంది. ఈ పాటకు మంచి స్పందన వచ్చింది. త్వరలో చి*త్ర *ట్రైలర్‌ను విడుదల చేస్తాం. వచ్చే నెలలో చి*త్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి కథ- మాటలు: రాఘవేందర్‌రెడ్డి, కెమెరా: కృష్ణమురళి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తున్న వినయ్ నర్వాల్‌కు భార్య వీడ్కోలు (Video)

పహల్గామ్ ఘటన ఊచకోత ... మతం అడిగి హతమార్చడం దారుణం : ఓవైసీ

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments