Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓటీటీ భూతం కాబట్టి థియేట‌ర్ల‌కు జ‌నాలు రావ‌డంలేదు - కే రాఘవేంద్రరావు

K. Raghavendra Rao, Sudhirgali Sudhir and others
, మంగళవారం, 12 జులై 2022 (16:01 IST)
శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు.. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, బ్ర‌హ్మానందం, వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ ట్యాగ్ లైన్. ఈ చిత్రం ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 
ఈ సందర్భంగా కే రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘చిన్న సినిమాలు ఆడటం కష్టమని అనుకుంటున్న తరుణంలో.. చిన్న సినిమాగా వస్తున్న పెద్ద నవ్వుల చిత్రమిది. పెద్ద సినిమాలకు ప్రమోషన్స్ అక్కర్లేదు.. మీరంతా కూడా సిన్సియర్‌గా ప్రమోట్ చేస్తేనే ఓపెనింగ్స్ వస్తాయి. ఇందులో మీడియా సహకారం కూడా కావాలి. ఓటీటీ భూతం ఉంది కాబట్టి.. జనాలను థియేటర్‌కు రప్పించడమే ఈ రోజుల్లో కష్టంగా మారింది. స్క్రిప్ట్ వింటున్నప్పుడే అందరూ ఎంజాయ్ చేశారు. ఎలా తీస్తున్నారా? అని ఓ సారి మారెడుమిల్లికి వెళ్లి చూశాను. మూడు రోజులుందామని వెళ్లా కానీ పది రోజులుండిపోయాను. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. పాటలు కూడా అద్భుతంగా తెరకెక్కించారు. ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో పాటలు ఎక్కువగా చూడరు. కానీ ఈ సినిమా మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్. నల్లమల సినిమాలో ఏమున్నవే పిల్లా అనే పాట విన్నప్పుడే.. పీఆర్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యాను. కొత్త వాళ్లకు చాన్స్ ఇవ్వడమే నా ఇంట్రెస్ట్. ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చారు. టీం అంతా కష్టపడి చేశారు. అందరికీ థ్యాంక్స్. ఆగస్ట్ 19న ఈ సినిమా రాబోతోంది’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇప్పుడు ధ్యాస నా మీదకు కాస్త మళ్ళింది - ఎస్పీ చరణ్