Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అందరి మాతృభాష కథ చెప్పాలని ఉంది :నిర్మాత ఆర్.బి చౌదరి

Vakada apparo, Yash Puri, RB Chaudhary
, సోమవారం, 14 నవంబరు 2022 (16:58 IST)
Vakada apparo, Yash Puri, RB Chaudhary
ప్రతిష్టాత్మక సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్.బి చౌదరి సమర్పణలో రూపొందిన 94వ చిత్రం 'చెప్పాలని ఉంది'. 'ఒక మాతృభాష కథ' అనేది ఉప శీర్షిక. యష్ పూరి, స్టెఫీ పటేల్ ప్రధాన పాత్రలలో అరుణ్ భారతి ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించారు. డిసెంబర్ 9న థియేటర్స్ లో విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
 
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత ఆర్ బి చౌదరి మాట్లాడుతూ..'చెప్పాలని ఉంది' మా 94వ చిత్రం. సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో చాలా మంది నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిచయం చేశాం.  ఇప్పుడు మరో ప్రతిభావంతుడైన నటుడు యష్ పూరిని హీరోగా పరిచయం చేస్తున్నాం. 'చెప్పాలని ఉంది' యూనిక్ సబ్జెక్ట్. డబల్ పాజిటివ్ చూసిన తర్వాత యష్ నటన పట్ల చాలా తృప్తిగా వున్నాం. తనకి చాలా మంచి భవిష్యత్ వుంటుంది. హీరోయిన్ గా చేసిన స్టెఫీ పటేల్ కి కూడా మంచి భవిష్యత్ వుంటుంది. ఈ చిత్రంతో అరుణ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. వైవిధ్యమైన కథలని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గొప్పగా ఆదరిస్తారు. అందుకే ఈ చిత్రాన్ని ముందుగా తెలుగులోనే రూపొందించాం. తెలుగు తర్వాత తమిళ్ తో పాటు మిగతా భాషలో రీమేక్ చేస్తాం. 'చెప్పాలని ఉంది' యూనిక్ సబ్జెక్ట్. అందరికీ నచ్చుతుంది. హమ్స్ టెక్ ఫిలిమ్స్ తో కలసి ఈ సినిమా చేసాం. విజయ్ చక్కని మాటలు రాశారు. చిత్ర యూనిట్ అందరికీ అల్ ది బెస్ట్'' తెలిపారు.
 
యష్ పూరి మాట్లాడుతూ..'చెప్పాలని ఉంది' కంప్లీట్ ఎంటర్ టైనర్. యాక్షన్ రోమాన్స్ కామెడీ అన్నీ ఎలిమెంట్స్ వున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు 'చెప్పాలని ఉంది' కనెక్ట్ అవుతుంది. సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు వుంటాయి. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ లో హీరోగా పరిచయం కావడం నా అదృష్టం.  ఆర్.బి చౌదరి గారికి , అంజన్ కుమార్ , యోగేష్ కుమార్ గారికి కృతజ్ఞతలు. డిసెంబర్ 9న థియేటర్స్ లో కలుద్దాం'' అన్నారు
 
స్టెఫీ పటేల్ మాట్లాడుతూ.. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ లో సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ఆర్.బి చౌదరి గారికి, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇందులో వెన్నెల అనే పాత్రలో కనిపిస్తాను. ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శకులు అరుణ్ గారికి కృతజ్ఞతలు. యష్ తో పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో భాగమైన వారందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రేక్షకులు తప్పకుండా నచ్చుతుంది'' అన్నారు.
 
వాకాడ అప్పారావు మాట్లాడుతూ..  'చెప్పాలని ఉంది' ట్రైలర్ చూస్తూనే ఇందులో డిఫరెంట్ కంటెంట్ వుందని నమ్మకం కలిగించింది. ఈ సినిమా చూశాను. దర్శకుడు చాలా మంది కథతో వచ్చారు. హీరో కొత్త కుర్రాడు. చాలా చక్కగా నటించాడు. హీరోయిన్ కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. దర్శకుడు చాలా అద్భుతంగా తీశారు. మాటల రచయిత విజయ్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ లో చాలా మంచి సినిమాలకు మాటలు రాశారు. ఈ సినిమాలో మాటలు కూడా చాలా కొత్తగా వుంటాయి.   'చెప్పాలని ఉంది' నేషనల్ మూవీ. మాతృభాష కథ. యూనివర్షల్ గా అందరికీ కనెక్ట్ అయ్యే కథ. చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్'' తెలిపారు. ఇంకా హమ్స్ టెక్ ఫిలిమ్స్ యోగేష్, దర్శకుడు అరుణ్ భారతి, మాటల రచయిత విజయ్ చిట్నీడి  మాట్లాడారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మ వారి ఆలయ నేపథ్యంతో వారాహి చిత్రం