Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మ వారి ఆలయ నేపథ్యంతో వారాహి చిత్రం

Advertiesment
Sumanth, VV Vinayak and others
, సోమవారం, 14 నవంబరు 2022 (16:48 IST)
Sumanth, VV Vinayak and others
వారాహి అమ్మవారిని ఏడు శక్తి రూపాల్లో ఒకరిగా కొలుస్తారు. ఏడుగురు దేవతా మాతృమూర్తుల్లో వారాహి ఒకరు. వరాహ స్వామి శక్తి నుండి ఉద్భవించిన వారాహి అమ్మ వారి ఆలయ నేపథ్యంతో సుమంత్ హీరోగా వారాహి చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. వీరి కాంబినేషన్ లో గతంలో సుబ్రహ్మణ్యపురం అనే సినిమా రూపొందింది. ఈ సినిమా మంచి విజయం సాధించిన నేపథ్యంలో సుమంత్, సంతోష్ జాగర్లపూడి కొత్త చిత్రం వారాహిపై ఆసక్తి ఏర్పుడుతోంది. ఈ చిత్రాన్ని జీకే మూవీ మేకర్స్ పతాకంపై రమాదేవి నారగాని నిర్మిస్తున్నారు. 
 
సోమవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు వీవీ వినాయక్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. డివోషనల్ బేస్డ్ మూవీగా ఓ సరికొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపారు. ఈ సందర్భంగా
 
దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ...ఇవాళ మా సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించాం. సప్త మాతృకల్లో ఒకరైన వారాహి అమ్మవారి నేపథ్యంలో డివోషనల్ మిస్టీరియస్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. వచ్చే నెల నుండి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. అన్నారు.
 
హీరో సుమంత్ మాట్లాడుతూ... సంతోష్ ఈ కథ చెప్పగానే క్లాప్స్ కొట్టాను. భారీ ఎత్తున ఈ సినిమా చేయబోతున్నాం. మా కాంబినేషన్ లో వచ్చిన సుబ్రమణ్యపురం కంటే చాలా బెటర్ స్క్రిప్ట్ ఇది. ఇటీవల కాంతార, కార్తికేయ 2 చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. అలాంటి ఒక డివోషనల్ మిస్టీరియస్ థ్రిల్లర్ గా వారాహి ఆకట్టుకుంది. అన్నారు.
 
సత్యసాయి శ్రీనివాస్, గెటప్ శ్రీను, కృష్ణ చైతన్య తదితరులు పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - ఈశ్వర్ చంద్. కె ఆర్ ప్రదీప్ సహా నిర్మాత గా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాలోని ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షూటింగులో సొమ్ముసిల్లి పడిపోయిన నాగశౌర్య .. ఆస్పత్రిలో అడ్మిట్