Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదివారం కార్తీక పంచమి.. వారాహికి ఈ నైవేద్యాలను?

Advertiesment
Varahi Puja
, శుక్రవారం, 28 అక్టోబరు 2022 (19:44 IST)
Varahi Puja
కార్తీక పంచమి అక్టోబర్ 30న వస్తోంది. ఈ రోజున వారాహి అమ్మవారిని పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.  నలుపు రంగుతో కూడిన ఈమె గేదెను వాహనంగా కలిగివుంటుంది. పంచమి రోజున ఆమెకు పూజ చేయడం.. నైవేద్యం సమర్పించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
పానకం, మజ్జిగ నైవేద్యంగా పెట్టడం ద్వారా వారాహి జీవితాన్ని సుఖసంతోషాలతో నింపేస్తుంది. ఆలయాలలో శ్రీ వారాహి దేవికి ఎర్రని వస్త్రాలను ఇవ్వడం ద్వారా వ్యాపారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. తెల్లని పట్టు వస్త్రాన్ని ధరించడం వలన విద్యలో బలం చేకూరుతుంది. 
 
పసుపు పట్టు వస్త్రాన్ని ధరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వివాహానికి ఆటంకాలు తొలగిపోతాయి. పచ్చని పట్టును ధరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. 
 
నీలిరంగు పట్టు వస్త్రం ధరించడం వల్ల శత్రుభయం వుండదు. శ్రీ వారాహి పూజకు తామర కాండంతో తయారైన వత్తులను లేదా అరటి దూటతో తయారైన వత్తులతో దీపం వెలిగిస్తారు.  
 
నైవేద్యాలు: ఉప్పు లేని మిరియాల గారెలు, వెన్న లేని పెరుగు, శెనగపిండి, పంచదార పుష్కలంగా కలిపిన శెనగపిండి, మిరియాలు, జీలకర్ర కలిపిన దోసె, నవధాన్యాలతో చేసిన వడలు, కుంకుమపువ్వు, పంచదార, దాల్చిన చెక్క, పచ్చకర్పూరం కలిపిన పాలు, నల్ల నువ్వుల ఉండలు, బీట్ రూట్ హల్వా, దానిమ్మ పండును నైవేద్యంగా సమర్పించవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాస్తుశాస్త్రం: కార్తీక మాసంలో ఈ చెట్లను ఇంట్లో పెంచితే?