Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Dhanvantari Trayodashi 2022: బంగారంలో పెట్టుబడి పెడితే...

gold
, బుధవారం, 19 అక్టోబరు 2022 (16:13 IST)
ధన త్రయోదశి అక్టోబర్ 23వ తేదీన వస్తోంది. వచ్చే ఆదివారం ధన త్రయోదశి. ఆ రోజున బంగారు ఆభరణాలను, కాయిన్ల రూపంలో కొనుగోలు చేస్తుంటారు. బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. ధన త్రయోదశి  రోజున ఆయుర్వేదాన్ని రచించిన ధన్వంతరిని పూజిస్తారు. ఈ రోజు బంగారం కొంటే అదృష్టవంతులవుతారని భావిస్తారు. కుటుంబంలో ఆందరూ ఆయురారోగ్య ఐశ్వార్యాలతో ఉంటారని ప్రతీతి.
 
ధన త్రయోదశికి పౌరాణిక ప్రశస్తి ఎంతో ఉంది. వామనుడు త్రివిక్రమావతారాన్ని ధరించి బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించి, భూలోకం మొత్తాన్నీ ఒక్క పాదంతో ఆక్రమించిన రోజుగా ఈ ధన త్రయోదశిగా చెబుతారు. అంతేకాదు లక్ష్మీదేవిని నరకాసురుని చెరనుంచి విముక్తి చేసి, శ్రీ మహావిష్ణువు ఆమెను ధనాధిష్ఠాన దేవతగా ప్రకటించిన రోజును కూడా ధనత్రయోదశిగా పరిగణిస్తారు.  
 
 
ఇకపోతే.. ధన త్రయోదశి రోజున వెండి, కొత్త పాత్రలు, చీపుర్లు తదితర వస్తువులను కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే ఇదే రోజున నలుపు రంగు వస్తువులను పొరపాటున కూడా కొనకూడదుమి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపావళికి పచ్చకర్పూరం.. ఎర్రటి గుడ్డలో మెయిన్ డోర్ కు కడితే?