శివుడిని భక్తులు రోజంతా ఉపవాసం వుండి ప్రదోష కాల సందర్భంగా సాయంత్రం పూజలు చేస్తారు. ఈ రోజున భక్తులు ఉదయాన్నే లేచి స్నానమాచరించి.. పార్వతీ పరమేశ్వరులను ఆరాధించాలి. భక్తులు ఉదయం నుంచి ఉపవాసం వుండి ప్రదోష కాలంలో పూజలు చేయాలి. నైవేద్యంగా శివుడికి ఇష్టమైన పండ్లు, స్వీట్లు లేదంటే ఎవరి స్తోమతకి తగ్గట్లు ఫలహారంగా సమర్పించాలి. శివుడి మంత్రాన్ని జపించాలి.
పాప కర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే.. దానికి తగిన పుణ్య కర్మలు చేయాలి. ఇందుకు ప్రదోష పూజ చేయడం మంచిది. పాప కర్మలను ప్రదోషం పటాపంచలు చేస్తుంది.
ఈ త్రయోదశి నాడు ఎవరైతే రుద్రాభిషేకం చేస్తారో.. పంచకవ్యాలతో అభిషేకాలు చేయిస్తారో వారికి ఉత్తమ ఫలితాలు చేకూరుతాయి. రోజంతా శివధ్యానంలో మునిగివుండి సూర్యాస్త సమయంలో స్నానమాచరించి ఇంటిలో పూజ ముగించి శివాలయాన్ని దర్శించాలి.