Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌ల‌ర్ ఫొటో చిత్ర బృందాన్ని అభినందించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (20:50 IST)
చిన్న సినిమా.. పెద్ద సినిమా, స్టార్ కాస్ట్ లేదా కొత్తవాళ్లా ఇలాంటి తార‌తమ్యాలు ప‌ట్టించుకోకుండా త‌న మ‌న‌సుకు న‌చ్చిన సినిమాకు సంబంధించిన బృందాల్ని పిలిచి వారిని అభినందించ‌డ‌మే కాకుండా వారికి ప్రోత్సాహం ఇవ్వ‌డంలో ముందుంటారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇదే నేప‌ధ్యంలో ‌క‌ల‌ర్ ఫొటో చిత్ర బృందానికి స్టైలిష్ స్టార్ అభినంద‌నలు ద‌క్కాయి.
 
అంతేకాకుండా తాను క‌ల‌ర్ ఫొటో చిత్రాన్ని చూశానని, త‌నుకు ఈ సినిమా ఎంత‌గానో నచ్చింద‌ని ఈ సినిమాకు సంబంధించిన డైరెక్ట‌ర్‌కి, ఆర్టిస్టుల‌కి అభినంద‌న‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు స్టైలిష్ స్టార్. అక్టోబ‌ర్ 23న ఆహా యాప్ ద్వారా క‌ల‌ర్ ఫొటో చిత్రం విడుద‌లై అశేష తెలుగు సినీ అభిమానుల్ని ఆకట్టుకుంటూ బ్లాక్‌బస్ట‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే.
 
అటు ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖ‌ల‌తో పాటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కులు క‌ల‌ర్ ఫొటోపై ప్ర‌శంస‌లు జ‌ల్లు కురిపిస్తున్నారు. అమృత ప్రొడ‌క్ష‌న్స్, లౌక్స్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పైన శ్ర‌వ‌ణ్ కొంక స‌మ‌ర్ప‌ణ‌లో సాయిరాజేశ్, బెన్నీలు సంయుక్తంగా క‌ల‌ర్ ఫొటోని నిర్మించారు. సందీప్ ద‌ర్శ‌కత్వంలో సుహాస్, చాందినీలు జంట‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. ప్ర‌ముఖ న‌టుడు సునీల్, వైవా హ‌ర్ష‌ ఈ సినిమాలో కీల‌క పాత్రలు పోషించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments