Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహా కోసం రంగంలోకి దిగిన స్టార్ డైరెక్టర్స్

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (21:52 IST)
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆహాతో ఓహో అనిపించుకోవాలని.. బిగ్ సక్సస్ సాధించాలని డిజిటల్ ఫ్లాట్ఫామ్‌లో దిగిన విషయం తెలిసిందే. అల్లు అరవింద్ స్టార్ డైరెక్టర్స్‌ని రంగంలోకి దింపారని తెలిసింది. ఇంతకీ.. ఆహా కోసం వర్క్ చేస్తున్న స్టార్ డైరెక్టర్స్ ఎవరంటారా..? ముందుగా చెప్పుకోవాల్సింది. వంశీ పైడిపల్లి. సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో మహర్షి సినిమాని తెరకెక్కించిన వంశీ పైడిపల్లి.
 
ఆ తర్వాత మహేష్‌ బాబుతో మరో సినిమా చేయాలనుకున్నారు కానీ.. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు ఆహా కోసం వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు. ఇక బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇంకా షూటింగ్ చేయాల్సివుంది కానీ.. కరోనా కారణంగా ఆగింది. ఇదిలా ఉంటే.. కొరటాల పర్యవేక్షణలో ఆహా కోసం ఓ వెబ్ సిరీస్ రెడీ అవుతుందట. దీనికి కథను కొరటాల అందించగా దర్శకత్వం మాత్రం కొరటాల శిష్యుడు అందిస్తున్నాడని సమాచారం.
 
అలాగే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఓ వెబ్ సిరీస్ కోసం స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నారు. వీరితో పాటు రానా - సాయిపల్లవి జంటగా విరాటపర్వం సినిమా చేస్తున్న వేణు కూడా ఆహా కోసం వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు. మరి... ఈ స్టార్ డైరెక్టర్స్ చేస్తున్న వెబ్ సిరీస్‌తో అయినా ఆహా ఓహో అనిపించుకుంటుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments