Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నారా అండ్ నందమూరి ఫ్యాన్స్, అసలేమైంది?

Advertiesment
నారా అండ్ నందమూరి ఫ్యాన్స్, అసలేమైంది?
, సోమవారం, 10 ఆగస్టు 2020 (19:57 IST)
నారా చంద్రబాబుగారు, మీకు చిరంజీవి గుర్తుంటాడు, మహేష్ బాబు గుర్తుంటాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గుర్తుండడు. సొంత అల్లుడిని రాజకీయాల్లోకి ఎలాగో రానివ్వడం లేదు కనీసం బర్త్ డే విషెష్ కూడా చెప్పలేరా అంటూ నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
 
పార్టీ కోసం ప్రాణమిచ్చే అభిమానులం మేము. తెలుగుదేశం పార్టీ అంటే మాకు అంత గౌరవం. పార్టీ కోసం ఏమైనా చేస్తాము. అలాగే మాకు నచ్చిన నటుల కోసం కూడా మేము ప్రాణాలివ్వడానికైనా సిద్థంగా ఉన్నాము. అలాంటి నటులు, మీ కుటుంబంలోని వ్యక్తులను మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు. 
 
మహేష్ బాబు బర్త్ డే రోజు ప్రిన్స్ మహేష్ బాబుకు హ్యాపీ బర్త్ డే అన్నారు. చిరంజీవి బర్త్ డే చేసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలని చెప్పారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే వస్తే మాత్రం విషెస్ కూడా చెప్పలేదు. మా అభిమాన హీరోని రాజకీయాల్లోకి రాకుండా ఎలాగో ఆపుతున్నారు. దానికి మేము ఏమాత్రం ఫీలవ్వడం లేదు.
 
కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు మాత్రం ఎందుకు చెప్పరు అంటూ చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు నందమూరి అభిమానులు. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారుతోంది. నందమూరి అభిమానుల ట్వీట్‌కు నారా అభిమానులు రచ్చకెక్కద్దంటూ రిక్వెస్ట్ చేస్తూ పోస్టులు పెట్టారు. కానీ ఇప్పటివరకు చంద్రబాబునాయుడు దీనిపైన స్పందిచకపోవడంతో నందమూరి అభిమానులు మాత్రం సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందాల ఆరబోతలో ఫస్ట్.. ఆమడదూరంలో అవకాశాలు