Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందాల ఆరబోతలో ఫస్ట్.. ఆమడదూరంలో అవకాశాలు

Advertiesment
Tejaswi Madivada
, సోమవారం, 10 ఆగస్టు 2020 (18:42 IST)
తేజస్వి మదివాడ.. తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్-2 సీజన్‌లో అగ్గిరాజేసిన తెలుగు పిల్ల. ఆ తర్వాత సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని భావించారు. కానీ, సీన్ రివర్స్ అయింది. వెండితెర అవకాశాలు పెద్దగా రాలేదు. పైగా, సైడ్ క్యారెక్టర్లు కూడా మందగించాయి. 
 
దీంతో పలు టీవీ షోలకు యాంకర్‌గానూ వ్యవహరించింది. కానీ ఏం లాభం సినిమాలు అయితే కెరీర్‌లో లేవు. ఇప్పటికీ తేజస్వి అనగానే ఐస్‌క్రీమ్ గుర్తుకొస్తోంది. వేరొక సినిమా ఏదీ గుర్తుకు రాదు. ఇక ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. 
 
రోజుకొక హాట్ ఫోటో‌తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అందాల ఆరబోతకు ఏమాత్రం మొహమాటపడని ఈ తెలుగమ్మాయికి అవకాశాలు మాత్రం ఆమడ దూరంలోనే ఉంటున్నాయి. అయితే, ఇటీవల 'కమిట్మెంట్' అనే సినిమా చేస్తున్నట్టు తెలిపింది. 
 
కానీ ఇప్పుడు ఈ సినిమా ఊసు ఎక్కడ వినిపించడం లేదు. గ్లామర్ కావాల్సినంత ఉంది కాబట్టి సరైన సినిమా ఒకటి పడితే అమ్మడికి అవకాశాలు క్యూ కడతాయని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. మరి సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తున్న ఈ బ్యూటీకి ఏ దర్శకుడైనా అవకాశం ఇస్తాడేమో చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రవి తేజ సినిమాకు మాస్ టైటిల్ కిలాడి