Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రావణి ఆత్మహత్య కేసు : ఆచూకీ లేని 'ఆర్ఎక్స్ 100' నిర్మాత

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (08:12 IST)
బుల్లితెర సీరియల్ నటి శ్రావణి కొండపల్లి ఆత్మహత్య కేసులో మూడో నిందితుడుగా ఉన్న 'ఆర్ఎక్స్100' మూవీ నిర్మాత అశోక రెడ్డి అచూకీ ఇంకా లభ్యంకాలేదు. ఈ కేసులో ఆయన పేరును పోలీసులు ఏ3గా నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన అదృశ్యమైపోయాడు. దీంతో ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
కాగా, ఇదే కేసులో ఏ1గా ఉన్న సాయికృష్ణారెడ్డి, ఏ3గా ఉన్న దేవరాజ్ రెడ్డిలను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే, ఏ2 నిందితుడిగా ఉన్న అశోక్ రెడ్డిని విచారణకు హాజరు కావాల్సిందిగా ఎస్సార్ నగర్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోమవారం విచారణకు హాజరుకానున్నట్టు చెప్పినప్పటికీ, సెల్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో ఆయన సెల్‌ఫోన్ కాల్ డేటా ఆధారంగా అతడెక్కడున్నదీ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు.
 
మరోవైపు, సినిమా రంగంలో అవకాశాల పేరుతో శ్రావణితో అశోక్‌రెడ్డి దగ్గరయినట్టు పోలీసులు గుర్తించారు. శ్రావణికి దేవరాజ్ దగ్గర కావడంతో జీర్ణించుకోలేకపోయిన అశోక్‌ రెడ్డి... సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి వారు విడిపోయేలా చేశాడు. 
 
ఈ నెల 7వ తేదీన అమీర్‌పేటలో ఓ హోటల్ వద్ద శ్రావణి, దేవరాజ్‌తో గొడవ అనంతరం సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అశోక్‌ రెడ్డితో కలిసి శ్రావణిపై సాయి దాడిచేశారు. ఆత్మహత్యకు ముందురోజు జరిగిన వ్యవహారంలో అశోక్‌ రెడ్డి కీలకపాత్ర పోషించినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments