తెలుగు రాష్ట్రాల్లో సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది. శ్రావణి ఆత్మహత్యకు కారణం దేవరాజ్ అని సాయి అంటుంటే... సాయే కారణం అని దేవరాజ్ అంటున్నాడు. మధ్యలో అశోక్ రెడ్డి. దీంతో క్రైమ్ స్టోరీని తలపిస్తున్న ఈ కేసులో అసలు ఏం జరిగింది అనేది ఆసక్తిగా మారింది.
శ్రావణి ఆత్మహత్య గురించి సాయి మాట్లాడుతూ.... శ్రీకన్య హోటల్లో నేను శ్రావణిపై దాడి చేయలేదు. ప్రేమ పేరుతో శ్రావణిని దేవరాజు మోసం చేశాడు అన్నాడు. ఈ విషయాన్ని ఆమెకు తెలియజేసేలా చేశాను కానీ... దేవరాజును శ్రావణి పూర్తిగా నమ్మింది. నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. దేవరాజు వచ్చిన తర్వాత సగం జీవితం మొత్తం మారిపోయింది. ఆమె దేవరాజును పూర్తిగా నమ్మింది.
అతను ఆమెను ఎంతలా ట్రాప్ చేశాడంటే కనీసం తల్లిదండ్రుల మాటలు కూడా నమ్మలేని పరిస్థితి వచ్చింది. అమ్మాయిలను ట్రాప్ చేయడం ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేయడం దేవరాజుకు అలవాటు. ఎదుటి వారి మనస్తత్వం తెలుసుకొని దానికి తగ్గట్టుగా దేవరాజు ప్రవర్తిస్తుంటాడు. ఆ విషయం తెలియక శ్రావణి దేవరాజును నమ్మింది.
నేను కొట్టడం ద్వారానే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని అనుకుంటే... సోమవారం నాడు గొడవ జరిగింది. ఒకవేళ అలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డా అదే రోజు చేసుకోవాల్సింది కానీ.. మంగళవారం నాడు రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఒక్కో అమ్మాయితో ఒక్కో విధంగా వ్యవహరిస్తాడు దేవరాజు. ఇంతకుముందే కొంతమంది అమ్మాయిలను మోసం చేసి బ్లాక్మెయిల్ చేశాడు దేవరాజు.
ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత దేవరాజు అసలు రూపం తెలిసింది. అప్పటివరకు ఎంతో అమాయకుడిగా కనబడ్డ దేవరాజు ఇంట్లో నుంచి పంపించి వేశాక శ్రావణిని ఏవిధంగా బెదిరించాడో మాకు అర్థమయింది. శ్రావణి ఆత్మహత్య చేసుకునేంత అమాయకురాలు కాదు. చాలా ధైర్యవంతురాలు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం దేవరాజే అని సాయి అంటున్నాడు.