Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రావణి కోసం సాయి-దేవరాజు తన్నుకున్నారు, ఫోటోలు హల్చల్

Advertiesment
శ్రావణి కోసం సాయి-దేవరాజు తన్నుకున్నారు, ఫోటోలు హల్చల్
, శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (20:59 IST)
శ్రావణి ఆత్మహత్య కేసు దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలుగు లోనికి వస్తున్నాయి. ఒక వైపు సాయి, మరొకవైపు దేవరాజు ఇద్దరితో ప్రేమాయణమే శ్రావణి కొంపముంచిందా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ముందుగా సాయితో ప్రేమలో ఉన్న శ్రావణి దేవరాజు పరిచయం తర్వాత తన ప్రేమను డైవర్ట్ చేసినట్టు తెలుస్తోంది.
 
దేవరాజుతో పరిచయం అయిన కొద్దిరోజులకే శ్రావణి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. 
ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నా తమపైనే కేసు పెట్టిన దేవరాజుపై ప్రేమ మాత్రం తగ్గలేదు. సరికదా కుటుంబ సభ్యులకు, సాయికి తెలవకుండా దేవరాజును కలిసేది శ్రావణి.
 శ్రావణి ఇంట్లో కుటుంబ సభ్యులు, సాయితో జరిగిన గొడవే ఇందుకు నిదర్శనంగా కనపడుతోంది.
 
ఓ వైపు ఇంట్లో గొడవ జరుగుతున్నప్పటికీ మరోవైపు ఏమీ తెలియనట్టుగా దేవరాజుకు కాల్ చేసి జరుగుతున్న గొడవను వినిపించింది. దేవరాజు తెలివిగా జరుగుతున్న గొడవను ఓ వైపు ఫోన్లో వింటూనే మరోవైపు కాల్ రికార్డ్ చేసాడు. సుమారు అరగంట జరిగిన గొడవను రికార్డ్ చేసి సేఫ్‌గా ఉంచుకున్నాడు దేవరాజు. శ్రావణి ఆత్మహత్య తర్వాత దేవరాజును అదుపులోకి తీసుకోవడంతో ఆడియో మీడియాకు లీక్ అయింది.
 
కుటుంబ సభ్యులతో జరిగిన గొడవలో దేవరాజుపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచింది శ్రావణి. రెస్టారెంట్లో తనను సాయి అందరిముందు కొట్టడం, లిఫ్ట్ వద్ద కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని శ్రావణి తల్లిదండ్రులను నిలదీసింది. ఈ వ్యవహారంలో సాయి-దేవరాజ్ పరస్పరం భౌతిక దాడులకు కూడా పాల్పడ్డారంటూ మీడియాలో ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇద్దరు పిల్లల తల్లితో కానిస్టేబుల్ సహజీవనం, పెళ్ళి చేసుకోమన్నందుకు..?