Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రావణి ఆత్మహత్యకు ఆర్ఎక్స్ 100 నిర్మాత కారణమా? చక్కర్లు కొడుతున్న ఆడియో!

Advertiesment
శ్రావణి ఆత్మహత్యకు ఆర్ఎక్స్ 100 నిర్మాత కారణమా? చక్కర్లు కొడుతున్న ఆడియో!
, శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (10:51 IST)
"మనసు మమత", "మౌనరాగం" వంటి సీరియళ్ళలో నటించి మంచి పేరు తెచ్చుకున్న బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు ఇపుడు అనేక కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే శ్రావణి ప్రియుడుగా భావిస్తున్న కాకినాడకు చెందిన దేవరాజ్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దీంతో ఆయన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 
 
అలాగే, శ్రావణి ఇంట్లో పని చేసే సాయికృష్ణారెడ్డిపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొత్తగా "ఆర్ఎక్స్ 100" చిత్ర నిర్మాత అశోక్ రెడ్డి పేరు కూడా ఇపుడు కొత్తగా తెరపైకి వచ్చింది. శ్రావణి - అశోక్ రెడ్డిల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన ఆడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సంభాషణలను శ్రద్ధగా ఆలకిస్తే వీరిద్దరి మధ్య ఎంతో చనువుతో కూడిన దగ్గరి పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో నిర్మాత అశోక్ రెడ్డిని కూడా ఈ కేసులో పోలీసులు విచారించే అవకాశాలు లేకపోలేదు. 
 
మరోవైపు, పోలీసుల ఎదుట లొంగిపోయిన దేవరాజ్ రెడ్డి మాత్రం శ్రావణి ఆత్మహత్యకు తాను కారణం కానేకాదు అని వాదిస్తున్నాడు. శ్రావణి మృతికి ప్రధాన కారణం సాయి, అశోక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కానీ, శ్రావణి కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమార్తె ఆత్మహత్యకు దేవరాజే కారణమని, డబ్బుల కోసం ఆమెను వేధించాడని ఆరోపిస్తున్నారు.
 
ఇక, దేవరాజ్ విషయానికొస్తే అతడో ప్లేబోయ్ అని, అతడిది కాకినాడ అని పోలీసులు పేర్కొన్నారు. టిక్‌టాక్ వేదికగా ఎంతోమంది అమ్మాయిలను ట్రాప్ చేశాడని పేర్కొన్నారు. తనతోపాటు మరికొందరు అమ్మాయిలతోనూ దేవరాజ్ సన్నిహితంగా ఉన్నట్టు గుర్తించిన శ్రావణి అతడిని దూరం పెట్టిందని, ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని చెబుతున్నారు. శ్రావణి ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గంగవ్వ 10వారాల పాటు హౌస్‌లో వుంటుంది.. కౌశల్ మద్దతు