ప్రముఖ గాయని సునీతపై ఇటీవల పెళ్లి గురించి వార్తలు వినిపించాయి. ఆమె భర్త నుంచి ఆమె ఎందుకు దూరమైందో.. గాయనిగా, భార్యగా, తల్లిగా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొందో ఓ ఇంటర్వ్యూలో క్లియర్ కట్‌గా చెప్పేసింది. అయినా సింగర్ సునీతపై ఏదో ఒక వార్త నెట్టింట షికార్లు కొడుతూనే వున్నాయి.
తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ... తన వద్దకు సినీ ప్రముఖులు వస్తుంటారని చెప్పారు. ఈ క్రమంలో చిరంజీవి, రజనీకాంత్ వచ్చారని, రాజేంద్రప్రసాద్ అబ్బాయి జగదీష్ వస్తుంటారు, సింగర్ సునీత కూడా వస్తుంటారని వ్యాఖ్యానించారు. తాను రాకున్నా తన పేరు చెప్పడంతో సునీతకు కోపం వచ్చింది.
సాధారణంగా సునీత కూడా తనపై వచ్చే రూమర్స్ పెద్దగా పట్టించుకోరు. తన మనసుకు చాలా బాధ కలిగించే అశాలపై తప్ప ఆమె రియాక్ట్ అవ్వరు. ఆ తాజాగా ఆమె స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మాటలను ఖండిస్తూ పోస్ట్ పెట్టారు.
స్వరూపానందేంద్ర సరస్వతి లాంటి ప్రముఖ వ్యక్తి తన వద్దకు వచ్చిన భక్తుల జాబితాలో తన పేరు చేర్చడం ఆశ్చర్యంగా వుందని.. అందుకే క్లారిటీ ఇస్తున్నానని చెప్పారు. తాను స్వామిని కలవక పోయినా ఎందుకు ఇలా చెబుతున్నారో తెలియదంటూ సునీత తెలిపారు.
అయితే స్వారూపానంద చెప్పింది సింగర్ సునీత పేరు అయి ఉండక పోవచ్చని మరికొందరి వాదిస్తున్నారు. అలాగే స్వరూపానంద వద్దకు తాను వెళ్లలేదని సునీత చెప్పిన నేపథ్యంలో.. స్వరూపానంద ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.