Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇస్మార్ట్ శంక‌ర్ స్ర్కిప్ట్ లీక్ - పోలీసుకు ఫిర్యాదు చేసిన‌ ఛార్మి.. ప‌బ్లిసిటీ కోస‌మా..?

Advertiesment
ఇస్మార్ట్ శంక‌ర్ స్ర్కిప్ట్ లీక్ - పోలీసుకు ఫిర్యాదు చేసిన‌ ఛార్మి.. ప‌బ్లిసిటీ కోస‌మా..?
, మంగళవారం, 11 జూన్ 2019 (19:05 IST)
ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్. ఇటీవ‌ల‌ రిలీజ్ చేసిన సాంగ్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుండ‌టంతో టీమ్ అంతా చాలా హ్యాపీగా ఫీల‌య్యారు. అయితే... ఈ మూవీ స్ర్కిప్ట్ లీక్ అవ్వ‌డంతో పూరి టీమ్ షాక్ అయ్యారు. ఇన్‌స్టాగ్రామ్ లోని బ‌జ్ బాస్కెట్ గ్రూపులో ఈ మూవీ స్ర్కిప్ట్ లీకైంది. 
 
దీంతో ఈ మూవీ స్ర్కిప్ట్ లీక్ చేసార‌ని చిత్ర నిర్మాత ఛార్మి సైబ‌రాబాద్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో బజ్‌ బాస్కెట్‌ గ్రూప్‌లో ఈ చిత్రం స్ర్కిప్ట్‌ లీక్‌ అయిందని, గ్రూప్‌ అడ్మిన్‌ మురళీకృష్ణ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అయితే... కంప్లైట్ చేయడానికి క‌న్నా ముందు ముర‌ళీకృష్ణ‌ను సంప్ర‌దిస్తే... ఇన్ స్టాగ్రామ్‌లో పెట్టిన స్ర్కిప్ట్ తీసేయ‌డానికి భారీ మొత్తం డిమాండ్ చేసాడ‌ని... ఒక‌వేళ అడిగిన మొత్తం ఇవ్వ‌క‌పోతే... స్క్రిప్ట్‌ మొత్తాన్ని అన్ని సామాజిక మాధ్యమాల వేదికల్లోనూ షేర్‌ చేస్తానని బెదిరించాడని ఈ చిత్ర సహ నిర్మాత ఛార్మి సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలావుంటే... ఇదంతా ప‌బ్లిసిటీ కోసం ఇస్మార్ట్ టీమ్ ప్లాన్ అని సోష‌ల్ మీడియాలో కామెంట్లు వ‌స్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ స్ర్కిప్ట్ లీక్ చేయ‌డం సాధ్య‌మ‌వుతుందా..? అని అడుగుతున్నారు. మ‌రి... ప్ర‌చారంలో ఉన్న‌ది నిజ‌మేనా..? ఇస్మార్ట్ టీమ్ ఏమంటారో చూడాలి..!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవ‌డ్రా న‌న్ను తొక్కేది.. మ‌రోసారి నోరు జారిన‌ విశ్వక్ సేన్..!