Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం తెల్లారే చితక్కొట్టాడు... గాయని కౌసల్య

పెళ్లిలో మర్యాదలు సక్రమంగా చేయలేదనీ తన తల్లిని నిందిస్తుంటే తాను కల్పించుకుని తన తల్లిని ఏమీ అనవద్దని అన్నందుకే తన భర్త శోభనం రోజు మరుసటి రోజే కొట్టాడని ఆ సంఘటన ఇప్పటికీ బాధగా మిగిలిపోయిందని సినీ గాయన

Webdunia
ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (11:23 IST)
పెళ్లిలో మర్యాదలు సక్రమంగా చేయలేదనీ తన తల్లిని నిందిస్తుంటే తాను కల్పించుకుని తన తల్లిని ఏమీ అనవద్దని అన్నందుకే తన భర్త శోభనం రోజు మరుసటి రోజే కొట్టాడని ఆ సంఘటన ఇప్పటికీ బాధగా మిగిలిపోయిందని సినీ గాయని కౌసల్య చెప్పుకొచ్చింది. ముఖ్యంగా కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన తాను, వివాహమైన తొలి నాళ్లలోనే గృహ హింసను ఎదుర్కొన్నట్టు చెప్పుకొచ్చింది. 
 
తాజాగా ఆమె ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తాను ఎదుర్కొన్న గృహహింసను పూసగుచ్చినట్టు వివరించింది. పెళ్లిలో తమకు మర్యాదలు సరిగ్గా చేయలేదని గొడవకు దిగగా, తన తల్లిని ఏమీ అనవద్దని అన్నందుకే కొట్టాడని, ఆ దెబ్బ ప్రభావం ఏళ్లు గడిచినా తనపై ఇంకా ఉందని చెప్పింది. అప్పుడే చనిపోవాలని, విడాకులు తీసుకోవాలని అనుకున్నానని, అయితే, చిన్నతనంలోనే తండ్రి చనిపోగా, కష్టపడి పెంచిన తల్లి, పెళ్లి కావాల్సిన చెల్లెలు, సొసైటీ గురించిన ఆలోచన వచ్చి ఆగిపోయానని తెలిపింది. 
 
ఆ తర్వాత బాబు పుట్టిన ఆరేళ్ల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉందని, 'సూపర్ సింగర్ 7' జరుగుతున్న వేళ, సమస్యను పరిష్కరించేందుకు తన బావ వచ్చిన వేళ, వాళ్ల ముందు తనను రక్తం కారేలా కొట్టాడని, ఆ సమయంలో బాబు వచ్చి, "అమ్మను కొట్టొద్దు నాన్నా. ప్లీజ్‌ కొట్టొద్దు నాన్నా" అని వేడుకుంటుంటే హృదయం బాధతో ద్రవించిపోయిందని చెప్పింది.
 
భరించడానికి కూడా ఓ హద్దు ఉంటుందని, భర్త మారతాడని ఏళ్ల తరబడి ఎదురు చూశానని, కానీ తన ఆశ తీరలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కొడుకును చూసుకుంటూ ఆనందంగా ఉన్నానని, ఎవరి హక్కులను వారే కాపాడుకుంటూ ముందుకు సాగాలని నిశ్చయించుకుని జీవితాన్ని సాగిస్తున్నానని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments