Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాపట్లలో ఏం జరుగుతోంది? 6 నెలల్లో 16 మంది అమ్మాయిలు ఎందుకెళ్లిపోయారు?

బాపట్ల మండలంలో ఇటీవలి కాలంలో వరుసగా 13 మంది అమ్మాయిలు మిస్ అవడం సంచలనం సృష్టిస్తోంది. అది కూడా కేవలం 6 నెలల కాలంలో ఇలా అమ్మాయిలు మిస్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఐతే ఇప్పటివరకూ మిస్ అయినవారిని పోలీసులు సమర్థవంతంగా ట్రేస్ చేసి తిరిగి వారివారి తల్లిదం

Advertiesment
Bapatla minor girl
, శుక్రవారం, 9 జూన్ 2017 (18:15 IST)
బాపట్ల మండలంలో ఇటీవలి కాలంలో వరుసగా 13 మంది అమ్మాయిలు మిస్ అవడం సంచలనం సృష్టిస్తోంది. అది కూడా కేవలం 6 నెలల కాలంలో ఇలా అమ్మాయిలు మిస్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఐతే ఇప్పటివరకూ మిస్ అయినవారిని పోలీసులు సమర్థవంతంగా ట్రేస్ చేసి తిరిగి వారివారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఏపీ డిజిపి సాంబశివరావు తెలియజేశారు. గత ఏప్రిల్ నెల 21న కిడ్నాపయిన లిఖితను కూడా ఈరోజు ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా ఆమె ఆచూకి జమ్ము-కాశ్మీరు సాంబ సెక్టారులో లభించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
 
అసలు బాపట్లలోనే ఎందుకిలా జరుగుతోందంటూ ప్రశ్నించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం వుందని చెప్పారు. లిఖిత పాకిస్తాన్ దేశ సరిహద్దుకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో వుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఆచూకి లభించేవరకూ ఎంతో ఆందోళన చెందామనీ, బాలికను గల్ఫ్ దేశాలకు అమ్మేస్తే పరిస్థితి ఏమిటని ఆందోళన చెందినట్లు తెలిపారు. ఈ కేసులో బాలిక ఆచూకిని కనుగొనేందుకు ఎంతో శ్రమించామన్నారు. ధన రూపేణా సుమారు రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకూ ఖర్చుపెట్టామని వెల్లడించారు. 
 
ఏప్రిల్ 21న లిఖితను మాజీ జవాన్ కిడ్నాప్ చేశాడు. ఇతడిని ట్రేస్ చేసేందుకు ఓ మహిళ సాయం తీసుకున్నట్లు చెప్పారు. నేరస్తుడి బంధువులకు సంబంధించి అన్ని ఫోన్లను తమవద్దకు తీసుకుని అతడిని ట్రేస్ చేయడం జరిగిందన్నారు. అతడికి 45 సంవత్సరాలు, అమ్మాయికి 13 సంవత్సరాలని చెప్పారు. అతడు ఆమెపై ఏదైనా అఘాయిత్యం చేశాడని తేలితే జీవితాంతం శిక్ష పడేట్లు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 
 
అమ్మాయిలు ఇలా ఎందుకు తప్పిపోతున్నారన్న విషయాన్ని తల్లిదండ్రులు చెక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వడం వల్ల అందులో యూ ట్యూబ్, వాట్స్ యాప్ వంటివి వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయనీ, వాటి దుష్పరిణామాలే ఇలాంటి ఘటనలకు దారి తీస్తున్నాయని అన్నారు. అందువల్ల పిల్లలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనిస్తుండాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షాక్.. ఇంటర్ టాపర్ విద్యార్థి సన్యాసం స్వీకరించాడు... ఎందుకో తెలుసా?