Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

షాక్.. ఇంటర్ టాపర్ విద్యార్థి సన్యాసం స్వీకరించాడు... ఎందుకో తెలుసా?

గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి 17 యేళ్ళ వయసుకే సన్యాసం స్వీకరించాడు. ఆ విద్యార్థి పేరు వర్షిల్ షా. సన్యాసం స్వీకరించగానే అతని పేరు సువిర్యా రత్నా విజయ్‌జీ మహరాజ్‌గా మారిపోయింది. గుజరాత్ రాష్

షాక్.. ఇంటర్ టాపర్ విద్యార్థి సన్యాసం స్వీకరించాడు... ఎందుకో తెలుసా?
, శుక్రవారం, 9 జూన్ 2017 (16:35 IST)
గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి 17 యేళ్ళ వయసుకే సన్యాసం స్వీకరించాడు. ఆ విద్యార్థి పేరు వర్షిల్ షా. సన్యాసం స్వీకరించగానే అతని పేరు సువిర్యా రత్నా విజయ్‌జీ మహరాజ్‌గా మారిపోయింది. గుజరాత్ రాష్ట్ర ఇంటర్ పరీక్షల్లో 99.99 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు. కానీ, చదువుల కంటే సన్యాసం గొప్పదని భావించిన వర్షిల్ షా... ఆ మార్గాన్నే ఎంచుకున్నాడు. 
 
దీనిపై వర్షిల్ షా స్పందిస్తూ... ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించినప్పటికీ... అందరిలాగా ఆస్తులు సంపాదించడం ఇష్టం లేదు. ఆత్మశాంతి, శాశ్వితమైన ఆనందం సంపాదించడమే తన లక్ష్యం. తన వెనుక ఉన్నవాటిన్నిటినీ వదలేసి, జైన సన్యాసిగా మారినప్పుడే అది సాధ్యపడుతుందని చెప్పాడు. కాగా అతడి నిర్ణయానికి కుటుంబం సైతం సంపూర్ణ అంగీకారం తెలిపింది. 
 
జైన మత సిద్ధాంతాల ప్రకారం ‘‘జీవదయ’’ను పాటించడం వీరికి నేర్పించినట్టు తెలిపారు. జీవులకు ఇబ్బంది కలగకుండా వర్షిల్ షా ఇంట్లో విద్యుత్ వాడకం కూడా చాలా తక్కువగా ఉపయోగిస్తారు. ఆయన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ ఇంట్లో కనీసం టీవీ, రిఫ్రిజిరేటర్ వంటివికూడా లేకపోవడం విశేషం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ ఎవరితోనో తెలుసా... ఈలలు... చప్పట్లు(వీడియో)