Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరేంద్ర బాహుబలి చనిపోతే... ధియేటర్లలో కంట తడి పెట్టని వారు లేరు ఎందుకు?

ఈరోజు సినిమాలో అమరేంద్ర బాహుబలి చనిపోతే... ధియేటర్లలో కంట తడి పెట్టని వారు లేరు. అంత ఆరాధనకు గురయ్యాడు. ఎందుకు అమరేంద్ర బాహుబలిని జనం అంత ఉన్నత స్థాయిలో నిలిపి చూస్తున్నారు అనేది అంతుబట్టడం లేదు. బాహు

అమరేంద్ర బాహుబలి చనిపోతే... ధియేటర్లలో కంట తడి పెట్టని వారు లేరు ఎందుకు?
హైదరాబాద్ , మంగళవారం, 6 జూన్ 2017 (06:42 IST)
ఇప్పటి మన సినిమాల్లో కమర్షియల్ హీరోల లక్షణాలతో పోలిస్తే అలాంటి ఏ ఒక్క లక్షణం కూడా లేని పాత్ర బాహుబలి 2 లోని అమరేంద్ర బాహుబలి పాత్ర. సినిమాను ఎలివేట్ చేయడానికి, కలెక్షన్ల మోత మోగించడానికి అవసరమైన ఒక్క మాస్ లక్షణం కూడా అమరేంద్ర బాహుబలిలో లేదు. అయినా సరే రెండోభాగంలో ఆ పాత్ర ఎక్కడ, ఏ సన్నివేశంలో కనిపించినా సరే జనం నీరాజనాలు అర్పిస్తుంటారు. కట్టప్ప, కుమారవర్మ, శివగామి, దేవసేన ఇలా ప్రతి ఒక్క ముఖ్యపాత్రకూ అతడంటే ఆరాధనా బావం. హీరోలకుండే ఏ ఒక్క అల్లరి చే్ష్ట్యను అతడు చేయడు. దేవ సేన తప్ప  మరే అమ్మాయిల వెంబడి తిరగడు. మాస్ అనే లక్షణం కలికానిక్కూడా లేని సాఫ్ట్ కేరక్టర్ అది. 
 
కానీ ఈరోజు సినిమాలో అమరేంద్ర బాహుబలి చనిపోతే... ధియేటర్లలో కంట తడి పెట్టని వారు లేరు. అంత ఆరాధనకు గురయ్యాడు. ఎందుకు అమరేంద్ర బాహుబలిని జనం అంత ఉన్నత స్థాయిలో నిలిపి చూస్తున్నారు అనేది అంతుబట్టడం లేదు. బాహుబలి చిత్ర దర్శకుడు రాజమౌళి స్వయంగా ఈ  సందేహం చిక్కుముడి విప్పారు.

రామాయణంలో రాముడి పాత్రకు ఉన్న సకల లక్షణాలూ అమరేంద్ర బాహుబలిలో కనిపిస్తున్నాయి కాబట్టే అతడంటే జనం అంతగా వెర్రెత్తి పోతున్నారు. ఆపాత్రను రాముడి లక్షణాలతోనే తీర్చి దిద్దానని రాజమౌళి చెప్పారు. బ్రిటన్ లోని బ్రిటిష్ ఫిలిం ఇనిస్టిట్యూట్‍లో బాహుబలి చిత్ర ప్రదర్శన సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ సమావేశంలో రాజమౌళి స్వయంగా అమరేంద్ర బాహుబలి వ్యక్తిత్వాన్ని విప్పి చెప్పారు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
 
"భారతంలో కృష్ణుడు మనందరికీ తెలుసు కదా. 16 వేలమంది గోపికలు ప్రెండ్స్‌గా ఉంటారు. మన రెగ్యులర్ కమర్షియల్ హీరోకు ఏ లక్షణాలు ఉండాలో అవన్నీ శ్రీకృష్ణుడిలో ఉంటాయి. (నవ్వులు) అదే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాముడిని తీసుకుంటే చాలా బోరింగ్ కేరక్టర్. ఒకే అమ్మాయితో తిరుగుతాడు. ఎక్కువ మాట్లాడడు. వెరీ సాఫ్ట్ స్పోకెన్, పెద్దోళ్లు ఏది చెబితే అది చేసుకుంటూ వెళ్లిపోతాడు. అందుకే రాముడు ఎప్పుడూ కూడా రెగ్యులర్ కమర్షియల్ హీరో కాదు. కానీ భారత దేశంలో తీసుకుంటే ఒక్క కృష్ణుడి గుడికి 50 రాముడి గుళ్లు ఉంటాయి. పైగా భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాలుగా కృష్ణుడిని ఏమన్నా అన్నా తట్టుకుంటారు కానీ, రాముడిని ఏమన్నా అంటే మాత్రం తట్టుకోలేరు. ఆవేశం కుమ్ముకుచ్చేస్తుంటుంది. అంత వీరారాధన రాముడంటే. ఎందుకు అనేది నా ఆలోచన. 
 
ఎందుకు అలా జరుగుతోంది అని ఆలోచిస్తే. నా అబిప్రాయం ఏమిటంటే వాల్మీకి ఆ కేరక్టర్‌ను రాసినప్పుడు ఒక వీర మాస్ కేరక్టర్ హనుమంతుడు, ఇంకో మాస్ కేరక్టర్ లక్ష్మణుడు. అలాంటి కేరక్టర్లను క్రియేట్ చేసి వదిలాడు, వాళ్లు ఈ రాముడికోసం ప్రాణాలిచ్చేస్తుంటారు. రాముడంటే చచ్చిపోతారు. రాముడిని ఏమైనా అంటే తట్టుకోలేరు. అంటే డైరెక్ట్ హీరోయిజం కాకుండా అడ్మైరింగ్ హీరోయిజం.. చాలా సింపుల్‌గా ఒక సాఫ్ట్ కేరక్టర్‌ను సృష్టించి మాస్ కేరక్టర్లు ఆ కేరక్టర్‌ను దేవుడు అనటం మూలంగా మనకు అంత ఆవేశం వచ్చిందని ఒక థియరీని నేను తయారు చేసుకున్నాను. 
 
అప్పుడే నేను అమరేంద్ర బాహుబలి రాముడిలాగా ఉండాలి అని ఆలోచించాను. రాముడే నా ప్రధాన పాత్రధారి. కట్టప్ప, దేవసేన, శివగామి లాంటి హర్డ్ కోర్ మాస్ కేరక్టర్లు కలిసి ఈ సాఫ్ట్ కేరక్టర్ అయిన అమరేంద్ర బాహుబలిని దేవుడంటారు. అతడి కోసం ప్రాణాలిచ్చేయడానికి సిద్ధంగా ఉంటారు ఆ అడ్మైర్ హీరోయిజాన్ని తీసుకురావాలనుకున్నాను. అమరేంద్ర బాహుబలిని అలాగే సృష్టించాను. చాలా సాఫ్ట్‌గా ఉంటాడు. ఎన్నడూ ఆవేశంగా మాట్లాడడు. 
 
ఈరోజు అమరేంద్ర బాహుబలి చనిపోతే... ధియేటర్లలో కంట తడి పెట్టని వారు లేరు. అంత ఆరాధనకు గురయ్యాడు. అమరేంద్ర బాహుబలి పాత్రకు నేను చేసిన న్యాయం ఇదే అనుకుంటాను." 
 
అని అమరేంద్ర బాహుబలి పాత్ర ఔచిత్యం గురించి వివరించగానే బ్రిటిష్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్ వేదిక హర్షద్వానాలతో నిండిపోయింది.
 
బ్రిటిష్ ఫిలిం ఇనిస్టిట్యూట్‍లో రాజమౌళి, అనుష్క, కీరవాణి, శోభు ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని కింది లింకులో చూడగలరు. బాహుబలి టీమ్‌ ప్రతిమాటకూ శ్రోతలు హర్షధ్వానాలు చేయడం విశేషం. 

Baahubali 2: The Conclusion film-makers on the pan-Indian powerhouse

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15 రకాల బిరియానీలు లాగించే స్టామినా ప్రభాస్‌కు తప్ప ఎవరికుంది?. బయటపెట్టిన రాజమౌళి