Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నోటీసులంటే వణికిపోతున్న సినీ ప్రముఖులు... జాబితాలో 19కు చేరిన పేర్లు

హైదరాబాద్ వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు సిట్ బృందం వడివడిగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా సిట్ అధికారుల దర్యాప్తులో రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. మొదట 5... ఆ తర్వాత 8... ఇప్

Advertiesment
Drugs scandal
, సోమవారం, 17 జులై 2017 (12:20 IST)
హైదరాబాద్ వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు సిట్ బృందం వడివడిగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా సిట్ అధికారుల దర్యాప్తులో రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. మొదట 5... ఆ తర్వాత 8... ఇప్పుడు ఏకంగా 19 మంది డ్రగ్స్‌ తీసుకుంటున్న వారి జాబితాలో చేరారు. ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయోనని సినీ ప్రముఖులు వణికిపోతున్నారు. ముఖ్యంగా నోటీసులంటేనే ఉలిక్కి పడుతున్నారు. నోటీసులు వస్తే ప్రతిష్టకు భంగం కలుగుతుందన్నది వారి ప్రధాన ఆందోళనగా ఉంది. 
 
నిజానికి సినీ ప్రముఖులు డ్రగ్స్ కేసుల్లో పట్టుబడటం ఇదేం కొత్తకాదు. పలు డ్రగ్స్ కేసుల్లో తరచూ పట్టుబడుతూనే ఉన్నారు. వీరి కారణంగానే నైజీరియన్లు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. దర్యాప్తులో వీరు డ్రగ్స్‌ తీసుకున్నట్టు తేలింది. కొంతమంది నైజీరియన్లతో పరిచయం పెంచుకొని వారి ద్వారా మత్తు పదార్ధాలు కొనుగోలు చేసి ఇతరులకు పంచుతున్నట్టు నిర్ధారణ అయింది. 
 
ముఖ్యంగా బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌లో పబ్‌లు ఎక్కువగా ఉన్నాయి. వీటిని కేంద్రంగా చేసుకొని డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. గతేడాది డిసెంబర్‌లో బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 10లో వాటర్‌ పబ్‌ వద్ద డ్రగ్స్‌ అమ్ముతూ ముగ్గురు దొరికారు. వీరికి పబ్‌ యజమానితో లింకు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. 
 
ఈ సంఘటన జరిగాక పోలీసులు పబ్‌లలో తనిఖీలు చేపట్టారు. వీకెండ్‌లో కలిసే ప్రముఖుల పిల్లలు పబ్‌లలో ఓ గదిని బుక్‌ చేసుకొని ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్‌ తీసుకుంటున్నట్టు సమాచారం. రాత్రి కాగానే సినీ ప్రముఖులు, వారి సంతానం కోటరీగా ఏర్పడి డ్రగ్స్‌ తీసుకుంటున్నట్టు అనుమానిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'నా పేరు సూర్య' అంటున్న బన్నీకి జోడీ కుదిరింది...