Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా.. ప్రేమను పంచండి

Webdunia
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (11:48 IST)
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే గబ్బర్ సింగ్ హీరోయిన్ శ్రుతిహాసన్ ప్రస్తుతం ఫ్యాన్స్‌కు షాకింగ్ ఇచ్చే విషయాన్ని చెప్పింది. తాను గతంలో ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నానని, ఎవరో చెప్పినట్లు తాను జీవించనని పేర్కొంది. లావుగా వున్న తాను సన్నగా మారానని.. తన ఆకృతిపై పెద్ద రచ్చే జరిగిందని.. శ్రుతి హాసన్ తెలిపింది. ఇందులో భాగంగా రెండు ఫోటోలను పోస్టు చేసింది. 
 
హార్మోన్ల సమస్య కారణంగా తరచూ శారీరకంగా, మానసికంగా తాను ఇబ్బంది పడుతున్నానని తెలిపింది. గత కొన్నేళ్లుగా ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో కష్టపడుతున్నా. అదేమీ అంత సులభం కాదు. శారీరకమార్పుల వెనుక కష్టం మామూలుగా ఉండదు. కానీ, నా జర్నీ గురించి చెప్పడం చాలా సులువు. ఒకరి స్థాయిని మరొకరు నిర్ణయించలేరు.
 
అంతేగాకుండా.. గతంలో ప్లాస్టిక్‌సర్జరీ చేయించుకున్నా. దీని గురించి ఎప్పుడైనా ప్రచారం చేసుకున్నానా? లేదు. అలాంటివి తనకు ఇష్టం ఉండదు. తనకు ఎలా జీవించాలని వుందో అలాగే జీవిస్తా. మనకు మనం చేసుకునే మంచి ఏదైనా ఉందంటే, మన ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. ప్రేమను పంచండి. నిత్యం తనను తాను ప్రేమించుకోవడం నేర్చుకుంటున్నానని శ్రుతిహాసన్ చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలోని భవనంపై టెర్రస్ నుంచి నవజాత శిశువు మృతదేహం.. ఎలా వచ్చింది?

మాదాపూర్ బార్ అండ్ రెస్టారెంట్‌‌లో అగ్నిప్రమాదం... (video)

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments