చైనా కరోనాతో విలవిలలాడుతోంది. ఈ కరోనా వైరస్ ధాటికి చైనీయులు ఇంటి నుంచి బయటికి వచ్చేందుకు జడుసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ కరోనా వైరస్‌కు భయపడి జిరాఫీ కాస్ట్యూమ్‌ను ధరించింది. తన తల్లికి మందులు తీసుకురావాలి.
ఈ సందర్భంగా ఆమెకు ఇంట్లో మాస్కులు లేవు. బయట కూడా అందుబాటులో లేవు. దీంతో ఆమె జిరాఫీ కాస్ట్యూమ్ ధరించి వీధుల్లోకి వెళ్లి తనకు కావాల్సిన మందులు తీసుకుని తిరిగి ఇంటికి వచ్చింది. ఆమె వింత వేషాధరణను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ ఆమె మంచి పని చేసిందని ప్రశంసిస్తున్నారు.
జిరాఫీ మెడ భాగంలో విండో మాదిరిగా ప్లాస్టిక్ ఫిల్మ్ ద్వారా చూస్తూ ఆస్పత్రి వరకు నడుచుకుంటూ వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు నుంచే తన తండ్రి శ్వాసపరమైన సమస్యలపై తరచుగా ఆస్పత్రికి రెగ్యులర్ పేషెంట్ అని చెప్పింది. తన కుటుంబ సభ్యుల్లో తాను మాత్రమే ఆరోగ్యంగా ఉండటంతో ఇంట్లో కావాల్సిన నిత్యావసర వస్తువుల కోసం బయటకు వస్తున్నట్టు వెల్లడించింది.