చినకాకానిలో మహిళపై గ్యాంగ్ రేప్.. నగ్నంగానే..

మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (07:36 IST)
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. మంగళగిరి మండలంలోని చినకాకానిలో ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళను వివస్త్రను చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. 
 
కామాంధుల బారి నుంచి తప్పించుకునేందుకు బాధిత మహిళ నగ్నంగానే సుమారు రెండు వందల మీటర్ల దూరం పరిగెత్తినట్టు సమాచారం. మహిళను వెంటాడి మరీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. దీనిపై ఆ పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ మాట్లాడుతూ, రాష్ట్రంలో దిశ చట్టం తీసుకొచ్చామని వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోందే తప్ప, మహిళలను వేధించిన వైసీపీ నేతలు మాత్రం రోడ్లపై దర్జాగా తిరుగుతున్నారని మండిపడ్డారు. 
 
రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయని, ఇందుకు నిదర్శనం తాజాగా జరిగిన చినకాకాని ఘటనేనని విమర్శించారు. సీఎం జగన్ క్యాంపు ఆఫీసుకు దగ్గర్లోనే ఈ దారుణం జరిగిందని ఆమె ధ్వజమెత్తారు. పైగా, ఆ ప్రాంతమంతా 144 సెక్షన్ అమల్లో ఉందని ఆమె గుర్తుచేశారు. అయినప్పటికీ కామాంధులు ఈ దారుణానికి తెగబడ్డారని గుర్తుచేశారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అవసరమైతే తాడేపల్లిగూడెం నుంచే పోటీ చేస్తా: పవన్