Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరో 8 రోజుల్లో పెళ్ళి పెట్టుకుని చిన్నారిపై లైంగిక దాడి చేసిన యువకుడు

Advertiesment
మరో 8 రోజుల్లో పెళ్ళి పెట్టుకుని చిన్నారిపై లైంగిక దాడి చేసిన యువకుడు
, శనివారం, 1 ఫిబ్రవరి 2020 (12:27 IST)
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మరో 8 రోజుల్లో పెళ్ళి చేసుకోవాల్సిన ఒక యువకుడు ఒక చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి చివరకు ఊచలు లెక్కిస్తున్నాడు. 
 
అబ్దుల్‌ ఖయ్యూం అనే యువకుడు కేశవగిరిలోని జీఎం కాలనీలో ఉన్న ఉస్మానియా ఘనీ మసీదులో ఉంటున్నాడు. బీహార్‌లోని మధుబని జిల్లాకు చెందిన అతను ఉపాధి రీత్యా ఇక్కడికి వచ్చాడు. ఈ ప్రాంతంలోనే హోమ్ ట్యూషన్స్ చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే ఆ యువకుడికి వివాహం కూడా నిశ్చయమైంది. మరో 8 రోజుల్లో అతను పెళ్లి జరగాల్సి ఉంది. 
 
అయితే అతను ప్రస్తుతం జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. రెండు రోజుల క్రితం ఒక బాలిక ఇంటికి ట్యూషన్ చెప్పేందుకు వెళ్లిన అబ్ధుల్ ఆ సమయంలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే చిన్నారి గట్టిగా అరవడంతో ఆమె తల్లి వచ్చి యువకుడిని నిలదీసింది.
 
సెల్‌ఫోన్‌లో వీడియో చూసి భయంతో కేకలు పెట్టిందని కవర్ చేయబోయాడు అబ్ధుల్. అయితే తల్లికి అసలు విషయం అర్థమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. నిన్న మధ్యాహ్నం నిందితుడిని రిమాండుకు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బడ్జెట్ 2020 : రైతన్నకు బాసట... 16 సూత్రాల పథకం