Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నువ్వు తెల్లగా ఉన్నావంటూ అవి నలిపేశాడు... పిటి మాస్టర్ అఘాయిత్యం

నువ్వు తెల్లగా ఉన్నావంటూ అవి నలిపేశాడు... పిటి మాస్టర్ అఘాయిత్యం
, బుధవారం, 29 జనవరి 2020 (20:04 IST)
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పిటి మాస్టర్ కాస్త కామాంధుడిగా మారిపోయాడు. అది కూడా హోమో సెక్సువల్‌గా మారిపోయిన పిటి మాస్టర్ మగపిల్లలను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఆత్రం ఆపుకోలేక ఒక బాలుడితో కలిసి బాత్రూంలోకి వెళ్ళి అతని మర్మాంగాలపై దాడి చేసి వాంఛను తీర్చుకొన్నాడు. ఏం జరుగుతుందో తెలియని నిస్సహాయస్థితిలో ఆ బాలుడు చివరకు తల్లిదండ్రులకు చెప్పాడు. విషయం కాస్త అలాఅలా బయటకు రావడంతో పిటి మాస్టర్ పరారయ్యాడు.
 
తిరుపతి అన్నారావు సర్కిల్‌లో ఉన్న ఓ ప్రైవేటు స్కూలులో 8వ తరగతి చదువుతున్నాడు విద్యార్థి ధనుష్. అదే పాఠశాలలో గత సంవత్సరం నవంబర్ నెలలో అమరేష్‌ అనే ఇరవై ఒక్క సంవత్సరాల వ్యక్తి వ్యాయామ ఉపాధ్యాయుడిగా చేరాడు. పాఠశాలలో చేరినప్పటి నుంచి పిల్లలతో అమరేష్ అసభ్యంగా ప్రవర్తించేవాడట.
 
ముఖ్యంగా రాత్రి వేళల్లో హాస్టల్లో ఉండే సమయంలో విద్యార్థుల దుప్పట్లోకి దూరి లైంగికంగా వేధించేవాడట. అయితే విషయాన్ని బయటకు చెప్పొద్దని విద్యార్థులను భయపెట్టేవాడట. అయితే నిన్న రాత్రి హాస్టల్లో రాత్రి వేళలో బాత్రూంకు వెళ్ళాడు విద్యార్థి దనుష్.
 
దనుష్‌తో పాటు వెనకే వెళ్ళిన అమరేష్‌ బాత్రూం తలుపులు మూసివేశాడు. ధనుష్ మర్మాంగాలపై గట్టిగా చేత్తో నొక్కడమే కాకుండా నలిపేశాడు కూడా. నువ్వు తెల్లగా ఉన్నావంటూ దనుష్‌ను ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసేశాడట. దీంతో ధనుష్ గట్టిగా అరవడంతో మిగిలిన విద్యార్థులు అక్కడకు వచ్చారు.
 
భయంతో అమరేష్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. విషయాన్ని ధనుష్ తన తల్లిదండ్రులకు చెప్పడంతో కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. నిందితున్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిక్ టాక్‌తో స్నేహితులయ్యారు, వ్యభిచారం చేయమని ఇద్దరు మగాళ్ళను పంపిస్తే?