Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుంటూరు వింజనంపాడులో నాట్స్ ఉచిత దంత వైద్య శిబిరం

Advertiesment
గుంటూరు వింజనంపాడులో నాట్స్ ఉచిత దంత వైద్య శిబిరం
, శనివారం, 1 ఫిబ్రవరి 2020 (19:20 IST)
అమెరికాలో తెలుగువారికి ఏ కష్టమోచ్చిన అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు ఇండియాలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా వింజనం పాడు గ్రామంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించింది. ఇందులో ముఖ్యంగా దంత సమస్యలను ఉచితంగా పరీక్షించడంతో పాటు ఇక్కడకు వచ్చిన గ్రామస్థులకు ఆరోగ్యభద్రతపై అవగాహన కల్పించారు. 
 
నాట్స్ అధ్యక్షడు శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ డైరెక్టర్ మోహనకృష్ణ మన్నవ కలిసి ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.  ఇక్కడ విచ్చేసిన  గ్రామస్థులకు వివిధ రకాల నోటి పరీక్షలు చేశారు.ఇంట్రా ఓరల్ కెమెరాలతో దంత సమస్యలు గుర్తించారు. అత్యాధునిక  ఇంట్రా ఓరల్ డిజిటల్ పరీక్షలతో పాటు  ఎక్స్ రే  సెన్సార్, రేడియో గ్రాఫులతో కొన్ని వాధ్యులు గుర్తించారు. వీటిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  అవగాహన కల్పించారు. దాదాపు 200 మంది గ్రామస్థులు ఈ ఉచిత వైద్య శిబిరానికి విచ్చేశారు.
 
తెలుగునాట నాట్స్ సేవా కార్యక్రమాలు:
అమెరికాలో తెలుగువారికి ఏ కష్టమోచ్చిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ హెల్ప్ లైన్ కు కాల్ వస్తుందని నాట్స్ అధ్యక్షుడు  శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు. నాట్స్ అమెరికాలో తెలుగువారికి అండగా నిలబడుతుందని ఆపదలో ఉన్నవారికి ఆదుకుంటుందన్నారు. నాట్స్ తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. 
 
ఇటు తెలుగు నాట కూడా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిందన్నారు. తుఫానులు, వరదల సమయంలో కూడా నాట్స్ మానవత్వంతో ముందుకొచ్చి బాధితులకు తనవంతు సాయం అందించిందని శ్రీనివాస్ మంచికలపూడి పేర్కొన్నారు. తెలుగురాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని నాట్స్ డైరెక్టర్ మోహనకృష్ణ మన్నవ తెలిపారు. 
 
ప్రభుత్వ బడులను దత్తత తీసుకుని మౌళిక వసతులు కల్పించడం.. శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంతో పాటు ప్రకాశం జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో  నాట్స్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రజలకు సురక్షితమైన తాగునీరుని అందిస్తుందని  మోహనకృష్ణ మన్నవ వివరించారు. భవిష్యత్తులో కూడా తెలుగువారి మద్దతుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో వింజనంపాడు పంచాయతీ సెక్రటరీ పూర్ణాశేకర్, డాక్టర్.అనిల్ గారు అండ్ టీం, సీతారాం తాళ్లo మొదలైన వారు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాఫీ మరింత రుచిగా వుండాలంటే ఇలా చేయాలి?