Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డాడీ చనిపోయారు... ఇద్దరితో అమ్మ రాసలీలలు.. ఎస్పీకి పిల్లలు ఫిర్యాదు

Advertiesment
డాడీ చనిపోయారు... ఇద్దరితో అమ్మ రాసలీలలు.. ఎస్పీకి పిల్లలు ఫిర్యాదు
, మంగళవారం, 28 జనవరి 2020 (11:05 IST)
జిల్లా ఎస్పీకి ఓ ఇద్దరు చిన్నారులు ఓ ఫిర్యాదు చేశారు. తమ తండ్రి చనిపోయారనీ, ఆ తర్వాత తమ తల్లి ఇద్దరు వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుని తమను చిత్ర హింసలకు గురిచేస్తోందని ఆరోపించారు. ఆ ఇద్దరు పిల్లలు కన్నీటి పర్యంతో చెప్పిన మాటలు విని పోలీసులు చలించిపోయారు. 
 
బాధిత చిన్నారులు వెల్లడించిన వివరాల ప్రకారం, వీరి కుటుంబం నరసరావుపేటలో నివాసం ఉండేది. 2014లో నానమ్మ, 2015లో తండ్రి చనిపోయారు. అప్పటివరకూ బాగానే చూసుకున్న తల్లి, ఆపై వీరిద్దరినీ వదిలేసి తన దారి తాను చూసుకుంది. షేక్ రహీమ్ అనే వ్యక్తిని ఇంటికి తెచ్చిపెట్టుకుంది. ఆపై అతని స్నేహితుడు కొత్తపల్లి ప్రమోద్ అనే వ్యక్తి ఇంటికి రావడం మొదలు పెట్టాడు. వీరిద్దరూ చిన్నారులను తీవ్రంగా హింసించేవారు.
 
గత యేడాది వీరిని స్కూల్ మాన్పించేసి, ఇంట్లోనే నిర్బంధించారు. ఈ నెల 24న బాధితుల తల్లి, ప్రమోద్ గొడవపడి, చిన్నారులను కొట్టి తరిమేశారు. పక్కనే ఉన్న షాపులో రూ.100 అప్పు తీసుకుని, అమ్మమ్మ ఇంటికి వెళ్లిన వారు 'స్పందన'కు వచ్చారు. తమతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, తల్లిని, ఆమెతో సంబంధమున్న ఇద్దరినీ శిక్షించాలని వారు వేడుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శాసనమండలి ఓ గుదిబండ : ఆ పత్రిక కథనాన్ని పోస్ట్ చేసిన విజయసాయి