Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీకు పిల్లలు కూడా పుట్టేశారు కదా... ఇక నా తండ్రితో కాపురం చేయి, శాడిస్ట్ సపోర్ట్

Advertiesment
man
, శుక్రవారం, 24 జనవరి 2020 (16:48 IST)
కోడలంటే కూతురి తర్వాత కూతురు అంటారు. అలాంటిది కన్నబిడ్డలా చూసుకోవాల్సిన ఆమెనే కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడో కీచకుడు. నిత్యం వెంటపడుతూ బలవంతంగా అసభ్య వీడియోలు చూపిస్తూ పడక సుఖం అందించాలని పట్టుబడుతున్నాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన ఆమె భర్త కూడా తండ్రికే వత్తాసు పలకడంతో బాధితురాలు నరకం చూస్తోంది. 
 
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన మహమ్మద్ జాఫర్ అనే వ్యక్తికి వహీదా బేగం అనే మహిళతో 2012లో వివాహమైంది. వారికి ముగ్గురు సంతానం కలిగారు. నాలుగేళ్ల పాటు ఎంతో సంతోషంగా సాగిపోయిన వారి కాపురంలో జాఫర్ తండ్రి ప్రవేశించాడు. కోడలిపై కన్నేసి కోరిక తీర్చాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. 
 
గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను అసభ్యంగా తాకేవాడు. కొన్ని సందర్భాల్లో అత్యాచారానికి కూడా యత్నించేవాడు. మామ చేష్టలను మౌనంగా భరిస్తూ వచ్చిన వహీదా చివరికి భర్తకు విషయం చెప్పింది. అయితే భార్యకు మద్దతుగా నిలవాల్సిన జాఫర్ తండ్రికే వత్తాసు పలికాడు. నీకు పిల్లలు కూడా పుట్టేశారు కదా ఇక నా తండ్రితో కాపురం చేయి నేనేమీ అనుకోను అంటూ షాకిచ్చాడు.
 
కొడుకు ప్రోద్బలంతో ఆ కీచకుడు కోడలికి మరింత నరకం చూపించడం మొదలుపెట్టాడు. ఇలాగే ఊరుకుంటే ఆ కామాంధుడు ఏదొక రోజు తన జీవితాన్ని నాశనం చేస్తాడని ఊహించిన బాధితురాలు చివరకు మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. తాను మెట్టినింట్లో పడుతున్న వేదనను సభ్యులకు వివరించింది. దీనిపై విచారణ చేపట్టిన మహిళా కమిషన్ నిందితుడిని తమ ఎదుట హాజరు పరచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు..