Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బామ్మనే పెళ్లాడుతా.. పట్టుబట్టిన 22 ఏళ్ల కుర్రాడు.. ఆగ్రాలో ఘాటు ప్రేమ

Advertiesment
బామ్మనే పెళ్లాడుతా.. పట్టుబట్టిన 22 ఏళ్ల కుర్రాడు.. ఆగ్రాలో ఘాటు ప్రేమ
, శుక్రవారం, 24 జనవరి 2020 (12:03 IST)
ప్రేమకు కళ్లు వుండవని చెప్తే వినేవుంటాం. ఈ మాట ప్రస్తుతం నిజమైంది. 60 ఏళ్ల బామ్మ, 22 ఏళ్ల కుర్రాడు ఘాటుగా ప్రేమించుకున్నారు. ఈ వ్యవహారం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వెలుగులోకి వచ్చింది. బామ్మకు ఏడుగురు కొడుకులు, ఏడుగురు మనవళ్లు వున్నా.. ఆ బామ్మను తప్ప ఎవ్వరినీ వివాహం చేసుకోనని 22 ఏళ్ల కుర్రాడు పట్టుబడుతున్నాడు. కానీ బామ్మ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఆగ్రాకు చెందిన  60 ఏళ్ల బామ్మకు భర్త, ఏడుగురు కుమారులు, ఏడుగురు మనవళ్లు ఉన్నారు. ఎట్మదుద్దౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాశ్‌నగర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు.. ఆ బామ్మను చూసిన తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాడు. ఆమె కూడా అతడిపై మనసు పారేసుకుంది. ఇలా వీరి ప్రేమ కొన్నాళ్లు సాగింది. ఈ వ్యవహారం బామ్మ భర్తకు తెలియరావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
పోలీస్ స్టేషన్‌లోనే ఈ వివాదంపై ఇరు కుటుంబాల మధ్య వివాదం జరిగింది. 22 ఏళ్ల కుర్రాడు బామ్మను పెళ్లి చేసుకునేందుకు పట్టుబట్టాడు. ఎవరు ఎంతగా చెప్పినప్పటికీ వారు మాత్రం ససేమిరా కుదరదని తేల్చి చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోని పోలీసులు బామ్మ భర్త ఫిర్యాదుతో ఆ యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం సోషల్ మీడియాకు ఎక్కడంతో విపరీతంగా వైరల్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీడియాపై తప్పుడు కేసులు పెడతారా? ఏంటిది? చంద్రబాబు ఫైర్